Posts

Showing posts from March 5, 2023

I will fight-నేను పొట్లాడుదును.

Image
ఇతరుల మీద ఆధారపడే మనస్సు మన వ్యక్తిగత జీవితములోని గొల్యాతును చంపడానికి ఉపయోగ పడదు. మన అనుదిన జీవితములో ఎదురుపడే ఓ చిన్న సమస్య.మరో విధముగా చెప్పాలంటే ప్రతి దినము మనము ఓడిపోయే యుద్దము,ఇదే. మన సమస్యలో,మన బాధలో,మన దుఃఖంలో,గొల్యాతు  అనే శోధనలు-యుద్దములు ఎదురైనపుడు ఎవరైనా వచ్చి మన పక్షముగా నిలబడాలి,మనకు సహాయపడాలి,అని మనము ఎంత ఆశతో కోరుకుంటాము.కాని మనమే ఆ సమయములో నిలువబడాల్సిన విషయాన్ని మార్చపోతునము. ✝️లేఖనానుసారముగా మనము పిరికివారము కాదు,ఇంద్రియనిగ్రహముగల శక్తితో ప్రభువు మనలను నింపారు. 👉 2తిమోతికి 1: 7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. *ఆ ఏలా లోయలో ఇశ్రాయేలీయుల పరిస్థతిని మనము ఆలోచిస్తే వారు ఇలాంటి లోపమువల్లనే,తమ శత్రువులైన గొల్యాతును ఎదురించి చంపలేకపోయారు.వారికి తెలియని యుద్దాలా?వారికి తెలియని జయలా? *కానీ ఎప్పటివలెనే సైన్యమంతా కలిసి శత్రువు మీద దాడి చేసే పరిస్థితి కాదిప్పుడు.వారి ముందరకు వచ్చిన సమస్య ,వారిలో ఎవరైనా ఒక్కరే సైన్యమంతటి పక్షముగా యుద్దం చేయాలి.నిజానికీ అది ఎంత చిక్కుగానున...