ఏలా లోయలో----దావీదు వడిసెల
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రియులైన వారికి వందనములు.ఈ రోజు దావీదు జీవితములో ఓ గొప్ప అనుభవము,అలాగే ఈశ్రాయేలీయుల చరిత్రలో కూడా మరపురాని సంఘటనను గూర్చి ధ్యానము చేద్దాము. 1సమూయేలు-17: 50 దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను . గొల్యాతుతో జరిగిన యుద్దములో దావీదు విజయవీరుడయ్యడని చదువుకుంటాము.అవును అది నిజమే కాని దావీదు ఎలా జయించాడు?అంతటి ఆజానుబాహుని(ఆరుమూర్ల జానెడు ఎత్తు మనిషి. v4) చూచినప్పుడు దావీదుకు ఎలాంటి భయము కలుగలేదా? అలాంటి పరిస్థితిలో మనముంటే ఎప్పుడో పారిపోయేవారము.ఆ భాగమును పూర్తిగా చదివినపుడు దావీదు జయించాడని ఉంది, కాబట్టీ జయమొందినాడు అనుకుంటాం.కానీ ఆలోచించండి!!!అప్పటికి దావీదు వయస్సులోను,బలములోను చిన్నవాడే కానీ,ఇశ్రాయేలు సైనికాధ్యక్షులు ,రాజుసహితము ముందుకడుగేయలేని సమయములో ధైర్యమెలాగు వచ్చింది?11వ వచనము లో సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్ఠీయులు మాటలు విన్నప్పుడు బహు భీతులైరి.ఎందుకని వారిలో కొంచెం కూడ చలనము,చురుకు కలుగలేదు?వారిలో లేని కారణం దావీదులో స్పష్టంగా కనబడుతుంది. వారి కారణమ...