నా స్వచిత్తము
జ్ఞానులు క్రీస్తును రాజు అని ధృవీకరించేందుకు బంగారాన్ని అర్పించారు. వాళ్లు బంగారం తెచ్చి నిన్ను ధనవంతుడ్ని చేస్తున్నాం అనలేదు. బంగారం, ... అవేవైనా సృజించబడినవి, అన్నింటిపైన ఆయన సర్వశక్తి గలరాజుఅని నువ్వు ధృవీకరించాలి. అందుకోసం మనం బంగారాన్ని ఆయనకు అర్పించాలి. ఎప్పుడు మనం ఆయనను మన సొంత ప్రభువుగా రాజుగా కలిగి ఉండగలమో అప్పుడే అది సాధ్యమౌతుంది. నా స్వంత చిత్తం ఆర్పివేయబడినపుడు అది నాలో పరిపాలన చేయదు. నాలో క్రీస్తే కేవలం క్రీస్తే పరిపాలకుడు, నాలో ఏది ఆయనను సంతోషపెడుతుందో దానిని ఆయన నాలో జరిగిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యా యంలో మగ్దలేని మరియతో తన మరణ పునరుత్థానాల తరువాత “నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని సహోదరుల వద్దకు వెళ్లి చెప్పుమన్నారు”. మరియతో “నీవు వెళ్లి నా వద్ద నుండి పారిపోయిన సహోదరులకు వెల్లడి చెయ్యమని” చెప్పటంలో శిక్ష, నిత్య నాశనం పొందవలసిన వారికి, నా ఈ పునరుత్థానం వాళ్లు మంచి కోసమేనని, ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే వారి దేవుడౌతాడని చెప్పాడు. హెబ్రీ పత్రిక రాసిన రచయ...