Posts

Showing posts from January 22, 2023

సర్వ చిత్తంబు నీదేనయ్యా

సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి  రక్షింపుమా ||సర్వ చిత్తంబు|| ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున (2) అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||

నే నీవాడనై యుండఁ గోరెదన్-Iam Thine,O LORD

            1. నే నీవాడనై యుండఁ గోరెదన్ నే నీవాడనై యుండఁ గోరెదన్ యేసుప్రియ రక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్నుఁ జేర్చు నీ దరిన్ ||నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవు పడ్డ సిల్వకున్ నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా గాయపడ్డ ప్రక్కకున్ || 2. నన్నుఁ బ్రతిష్ఠ పర్చుమీ నాధా నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్ 3. నీదు సన్నిధిలో నిఁక నుండ నెంత తుష్టి నాకగున్ స్నేహితునిగా మాటలాడెదన్ సర్వశక్త ప్రభుతో 4. నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నే ననుభవించెదన్   I am Thine, O Lord, I have heard Thy voice, I am Thine, O Lord, I have heard Thy voice,   And it told Thy love to me; But I long to rise in the arms of faith,   And be closer drawn to Thee.   Draw me nearer, nearer, nearer blessed Lord,   To the cross where Thou hast died; Draw me nearer, nearer, nearer, blessed Lord,     To Thy precious, bleeding side. 2 Consecrate me now to Thy service, Lord,   By the pow’r...

మానవుని దృష్టిలో,దేవుని దృష్టిలో భక్తి అంటే.....?

Image
భక్తి అనేది..ఈరోజుల్లో ఒక సామాన్యమైన,సులువైన కార్యమైపోయింది.చాలా సులభముగా ఎవరైనా చేయగలిగితే చౌక-cheapగా భావ్యమౌతుంది.ఒక పాట,ఒక మాట అర్ధమైతే చాలు ఇంకా అదే భక్తి అనుకోని మురిసిపోతున్నాము.కానీ భక్తి అంటే-దేవునితో నడవడం అంత సులభమా?భక్తి అంటే-దేవుని యెదుట నడువడం,భక్తి -దేవుని కోసము నడవడం,దేవుని పక్షముగా నడువడం అంత సులభమా? దేవుని కోరకు ప్రత్యేకించబడినవారే,దేవుని కోరకు వేరుపరచుకున్నవారే ,దేవుని కోరకైన సమర్పణ కలిగినవారే దేవుని కోరకు నడువగలిగె సామర్ధ్యము,బలము,శక్తి,ధైర్యము పొందుదురు. దేవుని భక్తులను గూర్చి పరిశుద్ధ లేఖనములో కీర్తనకారుడైన దావీదు ఈలాగు చెప్పుచున్నాడు, దేవుని చేత బోధించబడే అభ్యాసము కలిగినవారుగా ఉండాలనీ తన కోసము దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. *ఆయనయందు ఉపదేశించబడుట ....ఎఫెసీ-4:20,21 *ఆయన తన మార్గములను మనకు బోధించును .యెషయా-2:3 *ఆయన మనలను నడిపించాలి,మనకు నేర్పించాలి..అప్పుడే ఆది భక్తి అవుతుంది.ఆయన నిన్ను నడిపిస్తే సకల జ్ఞానము గూర్చి,సకల విద్యలు గూర్చి నేర్పుతారు.భక్తి ఎలాంటిదో,అది ఎలా చేయాలి నేర్పిస్తారు. నీ ప్రవర్తనా ఎలా ఉండాలో,నీ...