మానవుని దృష్టిలో,దేవుని దృష్టిలో భక్తి అంటే.....?
భక్తి అనేది..ఈరోజుల్లో ఒక సామాన్యమైన,సులువైన కార్యమైపోయింది.చాలా సులభముగా ఎవరైనా చేయగలిగితే చౌక-cheapగా భావ్యమౌతుంది.ఒక పాట,ఒక మాట అర్ధమైతే చాలు ఇంకా అదే భక్తి అనుకోని మురిసిపోతున్నాము.కానీ భక్తి అంటే-దేవునితో నడవడం అంత సులభమా?భక్తి అంటే-దేవుని యెదుట నడువడం,భక్తి -దేవుని కోసము నడవడం,దేవుని పక్షముగా నడువడం అంత సులభమా?
దేవుని కోరకు ప్రత్యేకించబడినవారే,దేవుని కోరకు వేరుపరచుకున్నవారే ,దేవుని కోరకైన సమర్పణ కలిగినవారే దేవుని కోరకు నడువగలిగె సామర్ధ్యము,బలము,శక్తి,ధైర్యము పొందుదురు.
*ఆయనయందు ఉపదేశించబడుట....ఎఫెసీ-4:20,21
*ఆయన తన మార్గములను మనకు బోధించును.యెషయా-2:3
*ఆయన మనలను నడిపించాలి,మనకు నేర్పించాలి..అప్పుడే ఆది భక్తి అవుతుంది.ఆయన నిన్ను నడిపిస్తే సకల జ్ఞానము గూర్చి,సకల విద్యలు గూర్చి నేర్పుతారు.భక్తి ఎలాంటిదో,అది ఎలా చేయాలి నేర్పిస్తారు.
నీ ప్రవర్తనా ఎలా ఉండాలో,నీ బుద్ది ఎలా ఉండాలో,నీ స్వభావము ఎలా ఉండాలో,నీ నడతా ఎలా ఉండాలో ప్రతి చిన్న విషయం గూర్చి నేర్పుతారు.మన స్వాంతముగా కొన్ని షరతులు విధించుకుని,నియమాలు పెట్టుకుని మనకు ఇంపుగా నడిచేది భక్తి కాదు.యషయ 29:13 లో ...వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులనిబట్టి వారు నేర్చుకొనినవి.
సామెతలు-2:5,యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.
వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది
గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన
ప్రతివాడును నాయొద్దకు వచ్చును.
దేవుని చేత బోధింపబడు అనుభవములోనికి మనము నడిపింపబడుదుము గాక.
*దేవుడు అబ్రహాముతో "నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై "యుండుము.అది ఒక ప్రమాణముగా,ఒక ఆజ్ఞాగా,ఒక చేయూతగా ధైర్యము అతడు శక్తిగా కనబడుతుంది.
అబ్రహామా! నా ముఖము యెదుట ,నా ముందర నిందారహితముగా నడువు!నేను నిన్ను నడిపిస్తాను ఎందుకంటే నేను సర్వశక్తిగల దేవుడను.నీ దృష్టిలో నిందారహితముగా కాదు,నా దృష్టిలో నిందారహితముగా నడువాలి.ఈ రెండు మాటలు..అంటే అబ్రహము దృష్టి,దేవుని దృష్టి రెండు వేరు వేరు వర్గములువలె ఉన్నాయి. మనము నడువాల్సింది కూడా దేవుని దృష్టిలో ...ఆయనకు ప్రీతికారముగా..ఆది భక్తి అనబడుతోంది.కొన్నిసార్లూ ఈ మార్గము మనుషులకు,మన సొంత శరీరాలకి కూడా కొంచెం కఠినముగా,భారముగా కనిపిస్తుంది,కానీ అదే దేవునికి ఇంపైన సువాసన.చివరిగా కీర్తనలు-94:12,
యెహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
ఈ ప్రశస్త సమయంలో మనలను పరీక్షించుకుని,ప్రభు సహాయాన్ని కోరుదాము.పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు చదువు ప్రతి వ్యక్తిని దేవునిచేత నడిపించబడే,ప్రేరేపించబడే,బోధించబడే అనుభవజ్ఞముతో నిండిన భక్తిలోనికి నడిపించును గాక.ఆమెన్.ఆమెన్.ఆమెన్.
~StephyBlesseena,Berachah Holy Fellowship
Ipuru,(post&mondal),Palnadu Dist-522658.
Phone:9492081126,8328252204
To learn more of God's Word:
Youtube-Praying Hands
Praise the Lord sister
ReplyDeletePraise God sister.Hope you are blessed by this Blog.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete