నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.
సర్వాధికారము ఆయనకే!
నీ స్థానము క్రీస్తులోనే.ఈ రోజు నువ్వు క్రీస్తులో నిలిచియున్నావు. నీవునిలిచి యుండటానికి, నీ అనుభవానికీ మధ్య తేడాను గుర్తించటం మర్చిపోకు.
నీవు నిలబడింది క్రీస్తులోనే నీ అనుభవం నీ ఉద్రేకంలోనే. జాన్ బనియన్
అంటాడు "మన ఉద్రేకాలు డబ్బులు ఖర్చుపెట్టడం లాంటిది; మన జేబులో ఉన్నంత వరకే.అది చాలా ఎక్కువలా అనిపిస్తుంది గానీ యథార్ధానికి
తక్కువే; మనకు ముందుగా పరుగెత్తిన వానిలో మనం (విశ్వాసముంచటం)నిలబడటం, బ్యాంకులో మనకున్న డబ్బు లాంటిది. అది మన అనుదిన వ్యయంచే ప్రభావితం కాదు. నేను కొన్నిమార్లు సంతోషంగా ఉంటాను,
కొన్నిమార్లు వడిలిపోయినట్లుంటాను. విస్తారంగా బడలిక చెందుతాను,నరాల సత్తువ కోల్పోయినట్లుంటాను, కానీ వీటిని లెక్క చెయ్యను, నేను శ్రమలు గల చీకటిలోయ గుండా ప్రయాణిస్తున్నా.
నా కృంగుదల అస్థిరమైనది. నా స్థానం చెక్కు చెదరనిది, ఎందుచేతనంటే నాకు ముందుగా పరుగెత్తిన (యేసు) వాని యందు స్థిరపర్చబడినది.
నా శిరస్సు, ఆయనలోనే నేను దేవుని ఎదుట నిలువబోతున్నాను. దాని విషయమై దేవుడు సన్నుతించబడును గాక! నీ ఉద్రేకాలలో తేడాలు నీకు
రుజువులు కావు, క్రీస్తు నందే నీ ఒప్పందాలున్నాయి.
దేవుడు నా వ్యక్తిగత జీవితాన్ని మేకులతో సిలువకు కొట్టాడు. సిలువ తక్కువదనానికి, శాపానికి చిహ్నం. మ్రానున వ్రేలాడిన వాడు శాపగ్రస్థుడు.
నీ పాపయుక్త స్వయం పరిష్కరించబడింది, మరి ఆ శాపం ఎంత అర్హమైనది,దేవుని దృష్టికి అదెంత భయానకమైనది. నా కొరకు దానిని ఆలింగనం చేసుకోవటం, దానివైపు తేరి చూడటం, దానిలో నివసించటం! ఆహా! ఆశ్చర్య
కరమైన సిలువ, కానీ అంతటితో అయిపోలేదు.
నేను క్రీస్తు ఒకటి అయ్యాం.ఆయనలో నేను దానిపై వ్రేలాడాను. క్రీస్తులోనే నాకు ముగింపు దొరికింది,
ఆయన సిలువ వద్ద మోకరించి, ఐక్యతా స్థితిని ఆయన మరణంలో నేను పొంది, సిలువకు నన్ను నేను అప్పగించుకున్నాను.నిన్ను నీవు పూర్తిగా యేసుకు ఇచ్చివేసుకో. సముద్రాలు ఆయన పుడిసిటిలో ఇమిడిపోతాయని, పరలోకపు వానవిల్లును ఆయనే నింపేవాడని,సూర్యుడ్ని మిలియన్ల సంవత్సరాలకు సరిపడిన వెలుగుతో నింపినవాడని
చెప్పటం సాహసమౌతుందా? అలాంటప్పుడు పాపాన్ని జయించేట్లు ఆయన చెయ్యలేరా?అయనకు సర్వాధికారము ఇవ్వబడినది.నిన్ను ఆవహింపబోయె దయ్యాలు ఆయనెదుట గడగడలాడతాయి,వాటిని ఆయన వెళ్ళగొట్టలేరా?లేదు,కాదు అని నువ్వు జవాబు చెప్పలేని ప్రశ్నలివి.
✍️Fredrick Brotherton Mayer
~సేకరించబడినది.
Praise the Lord
ReplyDeletePraise the Lord
ReplyDelete