జీవములోను-మరణములోను నీసొంతముగా
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు
1సమూయేలు 22: 2
మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి.
👉పురాతన ఇశ్రాయేలు యోధులు వరదల్లో ఈదుకుంటూ దావీదు దగ్గరకు వచ్చారు. అప్పటికి దావీదు తలపై కిరీటం లేదు, కేవలం దేవునిచే అభిషేకించబడ్డాడు. వాళ్లు ఆయన్ని కలుసుకోగానే “యెష్షయి కుమారుడా, దావీదు
మేము నీ పక్షపు వారము" అన్నారు. వాళ్లు అతనికి చెందినవాళ్లు ఎందుచేతనంటే దేవుడే వాళ్లను దావీదుకు ఇచ్చాడు; వాళ్లు సంతోషంగా అతని పక్షం
వాళ్లు కావాలనే తీవ్ర ఆలోచన సఫలమయ్యేంత వరకూ వాళ్లు విశ్రమించరు.మనం కూడా యేసుక్రీస్తు విషయంలో అలానే ఎందుకు అవకూడదు?
✓ప్రభువైన యేసూ! నేను నీవాడను కావటం నీ హక్కు, నన్ను క్షమించుచాలాకాలం నా కోసం నేను జీవించాను. ఇప్పుడు నేను సంతోషంగా నాపైన,
నాకు కలిగియున్నవాటిపైన నీ హక్కును గుర్తిస్తున్నాను. ఇక మీదట నీకోసమే జీవించగోరుతున్నాను; ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పిం
చుకుంటున్నాను. జీవంలో మరణంలో నీవానిగా ఉంటాను.
✍️సంపూర్తిగా నిరంతరం నీ కోసమే జీవిస్తాను.
కోసమేజీవితంలో స్వల్పమైన బాధ్యతలను నమ్మకంగా క్రమంగా, ఆలోచనా సహితంగా నిర్వహిస్తే, మనుష్యుల మెప్పు కోసం కాదు, క్రీస్తుచే భళా!అనిపించుకునేందుకే, మనం పుచ్చుకోబోయే జీతం కోసం కాక, ఆయన
సేవలో ఒక చిన్న అవకాశం, ఆ గొప్ప ప్రపంచ నిర్మాణంలో మనకు పాలు ఇచ్చినందుకు, మనమేమైయున్నామో దాని కోసం కాక, ఆయన మనలను ఎంపిక చేసుకున్నందుకు, పరిస్థితులకు బానిస కాక, క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుభవించే వాళ్లంగా, ఈ లోకంలో ఆత్మయందు ప్రభువు మనకిచ్చిన వ్యక్తిత్వపు పునాది ఎంతో సౌందర్యవంతమైనది. (తీవ్రఅలల వత్తిడిలో పగడం
తయారవుతుంది). పగడాల కంటే సహించగలిగినది, నేడు మునివేళ్లపై నిలబడి, కన్నులు పైకెత్తి, మనుష్యులు దేవదూతలు చూడదగిన మరకతాల దీవి, సంవత్సరమంతా పచ్చగా ఉండే తావు, పరలోకపు పాటలు ప్రతిధ్వనించే పచ్చనైన చోటు మనం రేపు ఉండబోయే పరదైసు.
✓అందుచేతమన అనుదిన కార్యక్రమాల నిర్వాహణ విషయం జాగ్రత్త కలిగి ఉండాలి.
మనం నిత్యత్వంలో నివసించబోయే వ్యక్తిత్వాన్ని తయారు చేసుకుంటున్నాం.కొయ్యకాలు, పొట్టుతో మనం కట్టుకుంటే కాలిపోతుంది, వెలకట్టలేనంతనష్టం సంభవిస్తుంది; బంగారము, వెండి, వెలగల రాళ్లతో నిర్మించుకుంటే
అవి అందమైనవి, నిరంతర సంతోషానిచ్చేవి, ఎల్లకాలం నిలిచియుండేవి.
~Fredrick Brotherton Mayer
@సేకరించబడినది.
Comments
Post a Comment