Remembering God's deeds-దేవుని జ్ఞాపకము చేసికొనుట
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. 1సమూయేలు 17: 37 సింహము యొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు-పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. దావీదు నిజముగానే యుద్దము చేసి గొల్యాతును గెలిచాడా?యుద్ధం అంటే ఇద్దరు పోరాడితేనే కదా...మరి ఎలా ఏకముగా లోయలో అలాంటి పోరాటాలు ఏమి జరుగలేదే! అంతా సునాయాసముగా దావీదు గొల్యాతును ఎలా గెలిచాడు?అలా యుద్ధము చేయకుండనే నామమాత్రముగా అలా చేయి ఆడించి.... గెలిచాడా దావీదు? ఇశ్రాయేలీయులు చూడని యుద్దాలా,వారికి పరిచయము లేని యుద్దాలా?ఐగుప్తు విడిచినది మొదలు,ఎన్నెన్ని యుద్దాలు చేసి గెలిచారు,మరి ఈ సమయంలో వారికి ధైర్యము కలగలేదు.వారికి కలుగని ధైర్యము దావీదుకు ఎలా కలిగింది?ఇశ్రాయేలీయుల మీద మొదటిగా అభిషేకింపబడిన రాజైన సౌలుకు కూడ ధైర్యము కలగలేదు.దేవుని మేలులు జ్ఞాపకము చేసికొనడం సర్వ సామాన్యమైన స్తుతి అనుకుంటాము,కాని ఆ జ్ఞాపకములో ఎంత బలముందో,శక్తి ఉందో!అదే మన ప్రాణానికి నిరీక్షణ,బలము అని తెలుసుకోవా...