జీవములోను-మరణములోను నీసొంతముగా
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు 1సమూయేలు 22: 2 మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి. 👉పురాతన ఇశ్రాయేలు యోధులు వరదల్లో ఈదుకుంటూ దావీదు దగ్గరకు వచ్చారు. అప్పటికి దావీదు తలపై కిరీటం లేదు, కేవలం దేవునిచే అభిషేకించబడ్డాడు. వాళ్లు ఆయన్ని కలుసుకోగానే “యెష్షయి కుమారుడా, దావీదు మేము నీ పక్షపు వారము" అన్నారు. వాళ్లు అతనికి చెందినవాళ్లు ఎందుచేతనంటే దేవుడే వాళ్లను దావీదుకు ఇచ్చాడు; వాళ్లు సంతోషంగా అతని పక్షం వాళ్లు కావాలనే తీవ్ర ఆలోచన సఫలమయ్యేంత వరకూ వాళ్లు విశ్రమించరు.మనం కూడా యేసుక్రీస్తు విషయంలో అలానే ఎందుకు అవకూడదు? ✓ప్రభువైన యేసూ! నేను నీవాడను కావటం నీ హక్కు, నన్ను క్షమించుచాలాకాలం నా కోసం నేను జీవించాను. ఇప్పుడు నేను సంతోషంగా నాపైన, నాకు కలిగియున్నవాటిపైన నీ హక్కును గుర్తిస్తున్నాను. ఇక మీదట నీకోసమే జీవించగోరుతున్నాను; ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పిం చుకుంటున్నాను. జీవంలో మరణంలో నీవ...