"THIS WELL IS SO DEEP" ~ Stephy Blesseena
దేవుని యందు ప్రియులైన వారందరికీ పరిశుద్ధమైన వందనములు తెలియపరచుచున్నాము.ఫిలేమోను 26వ వచనము ప్రకారము
"మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును గాక .ఆమెన్
ప్రియులారా ఈ ప్రశస్తమైన సమయములో దేవుని పరిశుద్ధ లేఖనములలోనుండి దేవుడు మనతో మాట్లాడే మాట జాగ్రత్తగా గమనించుదాము.సమరయ స్త్రీ ని గురించిన భాగములో ఒక చిన్న విషయాన్ని ధ్యానము చేసికొందాము.సమరయ స్త్రీ జీవితమును మనము జ్ఞాపకము చేసికొనినప్పుడెల్ల ఆమె జీవితమూ ను దర్శించడానికి యేసుప్రభువారు ఆమెను ఎలా approach అయారు ....ఇంకా ఆమెలో దేవుని కార్యము ఎలా ఆరంభమయ్యింది..అని ఆలోచన చేస్తే మన జీవిత0 కూడా చాల స్పష్టముగా మనకు అర్థమవుతుంది .ఈ నాలుగవ అధ్యాయము లోని బావి ఆమె జీవితమనే లోతైన బావిని గూర్చి సూచిస్తున్నది .
ప్రభువు ఆమెను సమీపించింది భౌతికపరమైన నీళ్లు కాదు ..కానీ ఆమె లో ఆయన జీవము నింపబడాలని ఆమెను సమీపించారు .ప్రభువు ఆమెను సమీపించింది భౌతికపరమైన నీళ్లు కాదు ..కానీ ఆమె లో ఆయన జీవము నింపబడాలని ఆమెను సమీపించారు .ఉదాహరణకు మనము భూమిలోతులలోనుండి నీళ్ల కోసము , బోర్ వేసేటప్పుడు లోతునకు త్రవ్వి ...లోతైన జలముల కోసము ప్రయత్నిస్తామో...అలాగే.మనము భూమిలోనుండి నీళ్లను ఎందుకు త్రవ్వాలి అంటే?ఆ నీళ్లు మన కొరకు ఎల్లపుడు ఊరుతునుండునట్లు...అలా అయితే మనము ఎన్ని నీళ్ళనైనా తోడుకోవచ్చు...మనకు కొరత ఉండదు.అంత మాత్రమే కాదు కానీ ఆ లోతయిన నీళ్లలో..మలినములు ,కల్తీలు ఉండవు .ఎందుకంటే ఆది అది భూమిలోనుండి వచ్చే ఊట.,ఒక వ్యక్తి కూడా లోతునకు త్రవ్వబడితేనే దేవుని రక్షణ కార్యము లోతుగా ప్రారంభమవుతుంది.
ప్రభువు ఆమె తో మాట్లాడు చుండగా...."అమ్మ నాకు దాహమునకు నీళ్లిమ్మని అడుగగా...నీళ్లివ్వడము ఎంత భాగ్యము?కానీ ఆ ప్రశ్న ..ఆ మాట ఆమెలో ఎంత ఆలోచన కలుగచేసిందో కదా..!అవును దేవుని మాటలన్నీ చాలా లోతైనవి.చిన్న మాటే అయి యుంటుంది కానీచ చాల చాల లోతుగా ఉంటుంది.మన ప్రాణాత్మ దేహములను కదిలింపచేసి...త్రవ్వుతుంది .సరే ఆ మాట సమరయ స్త్రీ జీవితములో ఆమె ఆలోచనలలో ఎంతో కదిలింపు తీసుకుని వచ్చింది.ఎన్నో మాటలను,ప్రశ్నలు,సందేహములు దాటుకుంటూ ....ఆమె ఒక సమర్పణకు వచ్చింది.అది ఏమైయుంటుంది ?ఒకేసారి ఆలోచించండి.ఆమె సాయం కోరి వచ్చిన ప్రభువు కు ఆమె ఏమి సమర్పింపగలదు?నీళ్లా?;లేక ఇంకేమైనా ఉందా ?అంటే అవును .ఆమెను ప్రభువు అడిగింది ...భౌతికసంబంధమైన నీళ్లు కాదు గాని వాటికంటే మించినదే అడిగారు ప్రభువు .
యిర్మీయా-17:9-హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? అవును మానవుని హృదయము ఎంతో లోతైనది,అది ఘోరమైన వ్యాధి కలది,దాని గ్రహింపగలవాడెవడు?
అవును కదా మన వ్యక్తిగత హృదయములను పరిశీలన చేస్తే అవి ఎంత లోతైనవో! అయితే ఆ లోతైన స్థితిని గ్రహించుట ఒక కృపయైతే ,ఆ లోతులను ప్రభువు సమర్పించుట మరి అధికమైన కృప !చాలా మంది తమ జీవితములో ఏవైనా...దేవుని ఏదుట ఒప్పుకొనడానికి ,విడిచిపెట్టడానికి ముందుకు వస్తారు కానీ,వారిలో ఉన్న ఆ లోతయిన క్రియలు,మనస్సు,స్వభావమును గ్రహించటానికి ఇష్టపడరు.గ్రహించారు,లోబడరు,సమర్పించరు.కానీ దేవుని కార్యము లోతున జరగాలి.లేకపోతె ఆ కార్యము సంపూర్ణముగా నుండదు.లోతునకు రావాలంటే ....మనము తగ్గాల్సి ఉంటుంది .ఆ లోతుల్లో ఎంతో రహస్యమైన క్రియలు,చాల హేయమైన క్రియలు,ఆలోచనలు,తలంపులు,ఇవన్నీ బయటికి రావాలి...అప్పుడే మనము సంపూర్ణముగా రక్షింపడుతాము.సమరయ స్త్రీ .....తన లోతైన స్థితిని ప్రభువుకు సమర్పించింది.ఆ తరువాతే ప్రభువు ఆమె లోతుల్లోకి వెళ్లగలిగారు.ఆ అవకాశము ప్రభువు కల్పిస్తారు కానీ దానిని ఒప్పుకొనవలసినది నీవే."అయ్యా...!ఈ బావి లోతైనది కదా !అని సమరయ స్త్రీ ఎంతో బాధతో వ్యక్తపరచింది .అయ్యా నా జీవితము కూడా ఎంతో లోతైనది అని ఒప్పుకునింది.
ARE YOU READY TO OFFER UP YOUR
DEEPEST SELF?THEN ONLY THE WORK OF SALVATION WILL TAKE ACTION FROM WITHIN YOUR ROOTS.IT IS YOU WHO SHOULD OPEN UP.
ప్రియ దేవుని బిడ్డా నీవు కూడా నీ హృదయపు లోతులను ప్రభవునకు అప్పగించాలి.అప్పుడే నీవు లోతుగా రక్షింపడుతావు.సమరయ స్త్రీవలె నీవు కూడా నీ ప్రభువు నమ్మాలి.ఆమె ఎంత నమ్మి తన రహస్యపు జీవితాన్ని ,అప్పుడే పరిచయమైనా ప్రభువు తో పంచుకునినది...ఎంత నమ్మింది.నీవు కూడా అంతగా నమ్మగలవా...చాల మంది ఎదో ప్రభవును నమ్ముతున్నాం అనుకుంటారు కానీ ...లోతుగా ,,,ఆయన ఎదుట ఎలాంటి దాపరికం ,లేకుండునంతగా నమ్మలేరు.తమ రహస్య ప్రవర్తన,జీవితమూ ఒప్పుకునునంతగా నమ్మరు ,అందుకే వారిలో లోతైన రక్షణ కార్యమును చూడలేరు.దేవుని ప్రియులారా...మనము మన మూలాలలోనుండి రక్షింపబడాలి.లేనియెడల ప్రభువును వేడుకుందాము.లోతైన ఊటలు వేరు ,పైన తెలియాడు నీళ్లు వేరు.జీవజలములు చాల లోతైనవి.మనకు లోతైన ఈవులే కావాలి.సమరయ స్త్రీ వలే.
ప్రభువు మనలను లోతుగా శుద్ధిచేసి...లోతునుండి మనలను దీవించాలని ప్రభు సన్నిధిలో వేడుకుందాము..దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్ .
✍స్టెఫీ బ్లేస్సీనా
Comments
Post a Comment