Posts

Showing posts with the label Spiritual Edification

దేవుని పక్షము vs అపవాది పక్షము

Image
1 సమూయేలు - 18:17 "నీవు నా పట్ల యుద్ధ శాలివైయుండి యెహోవా యుద్ధములను జరిగించుము." ఈ భాగము దావీదుజీవితంలో ఎదురైన ఓ గొప్పసవాలు.   ఇశ్రాయేలియుల చరిత్రను ముగ్గురు వ్యక్తులు శాసించారు. 1. అబ్రహము - ఒకసంతానం వంశాన్ని స్థాపించినాడు,  2. మోషే- అబ్రహము పొందిన ఆ వాగ్దానాలు నెరవేర్చుటకు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి,దేవునికి - ఇశ్రాయేలీయులకు మధ్య ఒక మధ్యవర్తిలా- ధరశాస్త్రాన్ని  వారికందించి - వారినే - దేవునికి స్వాస్థం చేశాడు. 3 . దావీదు - దేవునికి ఒక సింహాసనాన్ని సిద్దపరచి,స్థిరపరిచాడు. ఆ వాగ్ధాన దేశాన్ని రాజ్యపరంగా, భూజనులనులందరిలో ఇశ్రాయేలు ఘనత నొందునట్లు, ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు. అయితే తాను బాల్య కాలములో, ఇంచుమించు 15-17 సంవత్సరాల వయస్సులో అభిషేకం పొందిన తరువాత, ఒక పెద్ద యుద్ధం ఎదురైంది, *గొల్యాతు అనే శూరుడు ఎదురవగా- ఆ యుద్ధంలో ఇది యెహోవా యుద్ధము అని అయిదు చిన్న రాళ్లతో ఆ బలాడ్యుడైన యుద్ధనేర్పరిని నేలను కూల్చగలిగినాడు. 17 వ అధ్యాయములో కనబడుతున్న యుద్ధం బాహ్యముగా కనిపించుచున్నగాని దావీదుకు మాత్రము అంతరంగిక యుద్ధం. అది బయటికి-బాహ్యంగా గొల్యాతు అంత శూరము...