సెలోపేహాదు కుమార్తేలు-#PastorStephen
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు హృదయపూర్వకమైన వందనాలు. సెలోపేహాదు కుమార్తేలు. Unsung heroes- Daring Daughters -Law.makers -Women.Empowerment -Faithful Daughters. ఇంకా వీరికి చాలా పేర్లు ఉన్నాయి 📖సంఖ్యాకాండము 27: 1 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థు లలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. *Daughters of Zelopehad - 5 Mahla, Noah, Hogla, Milcah, Tirza. మనష్షే గోత్రములో యోసేపు కుమారుడైన సంఖ్యాకాండము -26:29-33 సెలోపేహాదు కుమార్తేలు పరిశుద్ధగ్రంధములో చాల ప్రత్యేకతను సంపాదించుకున్నారు.సెలోపేహాదు కు కుమారులు లేరు, అయిదుగురు కుమార్తేలే.అయితే ఆ సెలోపేహాదు చనిపోయిన తరువాత వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలీయులు సేనలుగా బయల్దేరునట్లు,20 సంవత్సరములు పై ప్రాయముగలవారిని లెక్కించవలెనని మోషే దేవుని వలన ఆజ్ఞ పొందాడు.ఆలాగు లెక్కించునప్పుడు గోత్రములచొప్పున,తండ్రి పేరుచొప్పున లెక్కించి,వారికి చీట్లు తీసి వాగ్దాన ...