Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA
యేసుప్రభువు వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో దేవుని ప్రియులైన మీకందరికీ నా హృదయ పూర్వకమైన వందనములు. దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక మైన సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను.ఈదినము మన వాక్య ధ్యానము కొరకై -- * మత్తయి 14:25-33 "రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ...