Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA
యేసుప్రభువు వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో దేవుని ప్రియులైన మీకందరికీ నా హృదయ పూర్వకమైన వందనములు.
దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక మైన సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను.ఈదినము మన వాక్య ధ్యానము కొరకై --
*మత్తయి 14:25-33 "రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
Walking on the Waters
As the night was ending, Jesus came to them walking on the sea. When the disciples saw him walking on the water they were terrified and said, “It’s a ghost!” and cried out with fear. But immediately Jesus spoke to them: “Have courage! It is I. Do not be afraid.” Peter said to him, “Lord, if it is you, order me to come to you on the water.” So he said, “Come.” Peter got out of the boat, walked on the water, and came toward Jesus. But when he saw the strong wind he became afraid. And starting to sink, he cried out, “Lord, save me!” Immediately Jesus reached out his hand and caught him, saying to him, “You of little faith, why did you doubt?” Then those who were in the boat worshiped him, saying, “Truly you are the Son of God.”
Matthew 14:25-31, 33 NET
1.Why fear ,when the LORD himself is walking on your waters?
When we are in a deeper thirst of waiting on God and His Righteous Hand to be stretched out, we expect Him to come to us as in our expectations and as in our limitations. But the truth is a Big No. Because we believe in our own ways.
మనము ఆయన కోసము
ఎంతో వెదుకుతూ ఎదురుచూస్తుండగా...ఆయన ప్రత్యక్షమై ,ఆయన తన దక్షిణ హస్తము చాపుటకొరకు సమీపిస్తుండగా ఎందుకు గుర్తించలేకపోతున్నాం?
భయమెందుకు?నిన్ను సృష్ఠించినవాడు,ఆ సముద్రాన్ని ,ఆ నీళ్లను సృష్టించినవాడు ఎదురు నిలబడగా....!!!!
They were seeing a person who is walking on waters,
{1}Shouldn't they think of their Master?,instead they called that person as a ghost.
It is the LORD who sent them to the other side of the sea before Him.And they were alone without their master,and then there was a great wind,which skakes up their boat along with their faith.
వారు ఆ సమయములో సముద్ర ప్రయాణము చేస్తున్నందుకు కారణం ప్రభు చెప్పిన మాటయే కదా !మరి ఇప్పుడు ఆ మాట వారికి గుర్తు రాలేదా?ఎందుకని ఆ సమయములో ప్రభు గుర్తు రాలేదు వారికి?మన అవిశ్వాసము మనలో ఎంత లోతముగా కార్యము చేస్తున్నదంటే...*దేవుని కూడా గుర్తించనంతగా....ఆయన మాటలను గుర్తించనంతగా.అందువల్లనే అనేక పర్యాయాలు మనము చాల సులభముగా దేవుని కార్యాలను చూడలేము .మనకి అలానే కదా..కొన్ని కొన్ని పరిస్థితులు
ఎదురైనపుడు...మొదటిగా మన ప్రభువు గుర్తుకురారు!అలా ఎందుకని ?అంటే మన నడత కి కారణం ..మన ప్రయాణానికి కారణం ప్రభువు కాదా?మన నడిచే మార్గాన్నికి కారణం ప్రభు చెప్పిన మాట కాదా?మన నడత దేవుని వాక్యాన్ని అనుసరించినదిగా ఉండకపోతే,వాక్యానుకూలముగా లేనిచో మనం నడిచే మార్గములో తప్పకుండా భయాందోళనలు ఎదురవుతాయి.కానీ దేవుని మార్గములో ,ఆయన మాటలో నడిస్తే ఆ మాటే వెలుగిస్తుంది..
కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలో ఈలాగున చెపున్నారు
-"4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును."
*మన అవిశ్వాసము మన మార్గము తప్పిస్తుంది..కదిలించివేస్తుంది..
ఆనాడు శిష్యులు ప్రయాణిస్తున్న ఓడను కదిలించి కుదిపివేసినట్లుగా , మనము నడువవలసిన మార్గాన్ని సులువుగా తొలగి తప్పిపోతాము .
దేవుని మాటయే కదా ఒక వ్యక్తికి బలము మరియు ధైర్యము..మరి ఆ మాట ద్వారా మనము ధైర్యపరచబడక..అవిశ్వాసము వస్తే ఎలా?
ప్రభువు చెప్పిన మాటయే కదా!
మార్కు -6:45. "ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను."
ఆ మాటలోనే వారు ఆ సముద్రమును దాటి అద్దరికి వెళ్తారని ప్రభువు చెప్పారు కదా...!అప్పటికి ఎంతో సమయం కాలేదు ఆయన అయిదు రొట్టెలు,
రెండు చేపలు అయిదువేల మంది తినగా...12 గంపలు మిగులునట్లు ఆ ఆశీర్వాదము పలుకగా..విన్నారు..అంత లోనే వారిలో ఎంత అవిశ్వాసము వచ్చింది?
ఆశీర్వదించిన ప్రభువును చూచి భూతమనుకుని భయపడే అవిశ్వాసము !
.
దేవుని మాటే మనలో ధైర్యము నింపుతుంది...బలపరుస్తుంది.ఆ మాట లేకపోతె ఇంకా ఎన్నో భయాలే ,ఆందోళనలు,చికాకులు గలిబిలి,అస్థిరత్వము ...
ఇలాంటి వ్యతిరేకా భావాలన్నీ మనల్ని ఏలుబడి చేస్తూ మనల్ని కృంగదీస్తాయి.
ఈ ప్రశస్త సమయములో దేవుని బిడ్డా నీవు పొందిన దేవుని మాటలోనే నీకు కావాల్సినంత ధైర్యముంది,బలము,సామర్ధ్యముంది.
దానిని జాగ్రత్తగా పట్టుకో !ప్రభువే నిన్ను నిలువబెడతారు.
దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక !ఆమెన్ ఆమెన్ ఆమెన్
~స్టెఫీ బ్లేస్సీనా
Comments
Post a Comment