RUTH: A CROWN FOR THE LORD'S PURPOSE ~ Stephy Blesseena
Greetings to you All in the most precious and
mighty name of our LORD and SAVIOUR JESUS CHRIST
రూతు-3:11 కాబట్టి నా కుమారీ, భయపడకుము;
నీవు చెప్పినదంతయు నీకు చేసెదను.
నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.
దేని విషయములో ఆమె యోగ్యురాలిగా ఎంచబడినది?ఎందుకు యోగ్యత?అసలు ఒక వ్యక్తికి యోగ్యత అవసరమా?అసలు మన వ్యక్తిగత జీవితాల్లో యోగ్యత ఎందుకు?ఎం చేస్తుంది?ఇక్కడ బోయజు రూతును గూర్చి ,ఆమె తనకు భార్యగా యోగ్యురాలు అంటున్నాడా?లేక మరింకేదైనా విషయములోనా? యోగ్యతగా అంటే ఏమిటి? బోయజు దృష్టిలో ఏది యోగ్యత?
మీ దృష్టిలో యోగ్యత అని దేనిని అనుకుంటున్నారు?
తగ్గించుకోవడం ....ఇమిడిపోవడం,ఒదిగిపోవడం ..కదా !
ఇలాంటి అర్ధాలు ఉన్నాయి యోగ్యతకు.
మరి రూతు దేని విషయములో యోగ్యురాలిగా ఎంచబడినది?
రూతు ఎటువంటి కుటుంబము లోనుండి వచ్చింది?ఆ కుటుంబ మర్యాదలు ఎలాంటివి?అని మనము ఆలోచిస్తే అసలు ఏ మాత్రమూ పొందిక కుదరదు!
👉🕮 ఆదికాండము 19: 37 "వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును."
కానీ రూతు తన జీవితములో ఎంత అణుకువ గలది!చాలా మంది...ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి..చాల మదనపడతారు....నా విశ్వాసానికి సహకరించేవారు లేరు అని,రూతు కూడా ఇంకా భయంకరమైన చరిత్ర గల కుటుంబము లోనుండి వచ్చింది!విశ్వాసము కు ఆధారములు,మనం ఆనుకొనడానికి బలాలు ఉండవు,ఉండకూడదు.ఆలా ఉంటె అది విశ్వాసము కాదు.విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము విశ్వసించడానికి...నిరీక్షించడానికి ఎలాంటి ఆధారములు లేవు.
కానీ అపవాది ఎంత శోధించినా గాని,తన శరీరము ఎంత బలహీనంగా కనపడిన గాని...వాటన్నిటిని ఎదురించి ....వాటన్నిటికీ ఎదురీది ..విశ్వసించాడు.మనము కూడా మన చుట్టునున్న పరిస్థితులను ఎదిరించి,ఎదురీది విశ్వసించాలి.
అప్పుడే కదా మనము అబ్రాహాము పిల్లలనబడతాము!
సరే రూతు జీవితములోనుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే ఒక నూతన విషయాన్ని నేర్చుకుందాము!అదేమనగా రూతు లో దేవుడు కనుగొన్న యోగ్యత.ఆ యోగ్యత దేవునికి కాదు ప్రజలందరికి కనపడినది.చాల మంది..నేనెలా ఉన్నానో దేవునికి తెలుసు చాలు.నేను దేవుని దృష్టిలో యోగ్యురాలిగా ఉంటె చాలు.మనుష్యుల దృష్టిలో ఏమి అవసరం లేదు అని,కానీ మనము నిజముగా దేవుని దృష్టిలో యోగ్యముగా ఉన్నాము అంటే...అది దేవుడు మనలో మనకు నేర్పే ఒక పరిశుద్ధమైన కార్యము !అది మన చీకటి జీవితాల్లో ఒక వెలుగు సంబంధమైన కార్యము,మరి ఆ పరిశుద్ధమైన వెలుగు
కార్యము దేవునికి మాత్రమే కనపడుతుందా...లేదు కదా!
👉🕮 యోహాను 1: 4. "ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను."
నీలో దేవుడు చేసే కార్యము మాత్రమే
దేవునికి,నీకు మాత్రమే కాదు కానీ నీ చుట్టూ నున్న జనులకు కూడా తెలియబడాలి,
దేవుని కార్యము ఆలాగున ప్రకాశిస్తుంది.
సరే రూతు దేవుని దృష్టిలో యోగ్యురాలు.
✓ఆ దేశపు చట్టమైన ధర్మాశాస్త్రము విషయములో యోగ్యురాలు.
✓దేవుని ప్రణాళిక విషయములో యోగ్యురాలు.
✓దేవుని చిత్తము విషయములో యోగ్యురాలు.
✓దేవుడు యూదా గోత్రము విషయములో ఎలాంటి ఆలోచనలు కల్గియున్నారో
✓ఆ ఆలోచనలకు యోగ్యురాలు.
రూతు దేవుని తలంపుఁలకు ఒక కిరీటముగా ఎదిగినది.ఆలాగున కిరీటముగా ఎదిగిన స్త్రీ మహిమగా నిలుస్తుంది.అంటే ఓ మోయాబీయురాలు,శాపగ్రస్తురాలు దేవునికి మహిమగా నిలిచింది.కిరీటము మాత్రమే గదా మహిమనిస్తుంది,విలువనిస్తుంది,ఘనతనిస్తుంది.
👉🕮 I కొరింథీయులు-11:7 "స్త్రీ పురుషుని మహిమయై యున్నది."
నిజముగా దేవుని దృష్టిలో యోగ్యత అనే అలంకరణ మనలను ఎంత దీవెనకరముగా చేస్తుందో
!ఈ మాటలు చదువుచున్న ప్రియ దేవుని బిడ్డా...నీవెవరివైన....ఎలాంటి వ్యక్తిత్వం గలదానవైనా,గలవాడవైన ప్రాణం పెట్టిన మన ప్రియ ప్రభువు నిన్ను ఆయన దృష్టిలో,తనకొరకు యోగ్యముగా మలచుకుంటారు.నీవు లోబడతావా రూతు వలే?
అపవిత్రమైన లోతు కుమార్తెల రక్తం ప్రవహిస్తున్న మోయాబీయురాలు .....దేవునికి మహిమగా ,ఆయన తలంపులకు ,ఆలోచనలకు ఉద్దేశ్యాలకు కిరీటముగా మారినది.
ప్రియ సహోదరీ/సహోదరుడా ప్రాణము పెట్టిన ప్రియ ప్రభువు నిన్ను కూడా ఆయన ఉద్దేశ్యాలకు,తలంపులకు కిరీటముగా మహిమగా మార్చుతారు.
దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక,ఆమెన్ ఆమెన్ ఆమెన్
✍Stephy Blesseena
Comments
Post a Comment