Neglected Responsibility of Aaron-Berachah Prayer Holy Fellowship
నిర్గమకాండము 24-
దేవుడు తనను సీనాయి పర్వతము మీదకి రమ్మని పిలిచినప్పుడు ఇశ్రాయేలీయులను ఎలాబడితే ఆలా కాపరిలేని వారివలెనే విడిచిపెట్టకుండా..అహరోనును,హూరును ఇశ్రాయేలీయుల మీద వారికి ధైర్యముగా,తీర్పులు తీర్చునట్లు,న్యాయము తీర్చునట్లుగా బాధ్యతలు అప్పగించి దేవుని యొద్దకు వెళ్ళాడు.ఎంత నమ్మి అన్ని లక్షల మంది ప్రజలను...అప్పగించి,ఎంత బాధ్యత అప్పగించాడు.కానీ అహరోను ఎంత వరకు గ్రహించాడు !తన బాధ్యతను.కానీ అహరోనుకు ఆ బాధ్యత ఎంత అర్ధమైంది?
అయితే అహరోను 32 వ అధ్యాయములో అహరోను ఆ బాధ్యతను నెరవేర్చినట్లుగా కనపడదు.తనకివ్వబడిన బాధ్యతను అహరోను భద్రము చేసుకొనలేదు,కాపాడుకొనలేదు.అందుకే తన బాధ్యతను సంపూర్ణాముగా నిర్వర్తించలేకపోయాడు.1.అహరోను తనఇవ్వబడిన బాధ్యతను కాపాడుకోలేకపోయాడు,భద్రపరచుకొనలేదు.ఆ బాధ్యతను మరిచాడు.
నిర్గమకాండము 32-
25. ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.
అందుకే ఇప్పుడు ఇశ్రాయేలీయులలో వచ్చినా ఆ చెడ్డ ఆలోచనను తీర్చి వారికి మంచి చెడు చెప్పలేకపోయాడు.వారిలో ఆ చెడ్డ ఆలోచన పుట్టింది...మరి దేవుని ఎరిగిన వాడుగా దేవుని చూచిన వాడుగా {నిర్గమా-24:10}ఇశ్రాయేలీయులకు ఏమి చెప్ప ప్రయత్నించాడు?
అందును గూర్చి స్పష్టముగా లేఖనములోనే చూస్తాము .వారు మూర్ఖులు వారు వినరు,అందుకే వారు విచ్చలవిడిగా తిరుగులాడునట్లు వారిని విడిచిపెట్టేసాను.వారు మూర్ఖులే,వారు లోబడని వారే మరి అహరోను బాధ్యత ఏమైనది?
అహరోను తన కివ్వబడిన బాధ్యతను సంపూర్ణముగా నిర్వర్తించని కారణాన ఎంత నష్టము జరిగిందో తెలుసా ?
2.బాధ్యతను మరచి గొప్పపాపమునకు కారకుడయ్యాడు.
21. అప్పుడు మోషేనీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా.ఇశ్రాయేలీయులకు మొట్టమొదట ఒక విగ్రహము చేసిచ్చినవాడు అహరోనే!ఇశ్రాయేలీయులకు మొట్టమొదట ఒక విగ్రహము చేసిచ్చినవాడు అహరోనే!అదే ఇశ్రాయేలీయులలో విగ్రహారాధనకు ప్రారంభము అదే !అది మొదలుపెట్టినవాడు ఇశ్రాయేలీయులలో మొట్టమొదటి ప్రధానయాజకుడు అహరోనే.
ఈ ప్రశాంతమైన సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా నిజముగా నీ మీద ఉన్న బాధ్యత ఏంటి? అది చిన్నదియైన పెద్దదియైన ..ఆ బాధ్యతను కాపాడుకుంటున్నావా? భద్రపరచుకుంటున్నావా?అసలు నీమీద ఒక బాధ్యతను దేవుడు ఉంచాడనే విషయము తెలుసా?నువ్ బాధ్యతను మోసే గ్రహింపులో ఉన్నావా? ఆ అనుభవము మనలో ఉందా?
ఈ ప్రశాంతమైన సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా నిజముగా నీ మీద ఉన్న బాధ్యత ఏంటి? అది చిన్నదియైన పెద్దదియైన ..ఆ బాధ్యతను కాపాడుకుంటున్నావా? భద్రపరచుకుంటున్నావా?అసలు నీమీద ఒక బాధ్యతను దేవుడు ఉంచాడనే విషయము తెలుసా?నువ్ బాధ్యతను మోసే గ్రహింపులో ఉన్నావా? ఆ అనుభవము మనలో ఉందా?
ప్రతి విశ్వాసికి దేవుని విషయములో ఒక బాధ్యత ఉంటుంది.ఆ బాధ్యతను గ్రహించాల్సినది నీవే.దానిని కాపాడుకొనవలసినది నీవే .అది నీ యొద్దనుండి తీసివేయబడి వేరొకరికి ఇవ్వబడకముందే....నీవు నిర్లక్ష్యము చేసిన బాధ్యతవలన అనేకులకు దీవెనగా ఉండవలసిన నీవు నాశన పాత్రముగా మారకముందే నీవు మేల్కొని నీ బాధ్యతను కాపాడుకొనాలి.దేవుని సహాయము వేడుకొందాము.ప్రభు సహాయపడతారు.దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్ .దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్!
Comments
Post a Comment