Samaritan Woman-And Our Misgivings~ StephyBlesseena






యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.దేవుడు మిమ్మును తన వాక్యంతో దర్శిస్తున్నారని ,మీరు దీవింపబడుచున్నారని,బలపరచబడుచున్నారని ఎంతో సంతోషముతో నేను దేవుని స్తుతిస్తున్నాను.మీరు ఎలా బలం పొందుకుంటున్నారో మాకు కూడా తెలియపరిస్తే మేము ఇంకా సంతోషిస్తాము.మంచిది !ఈ ప్రశస్తమైన  సమయములో లేఖనములలోనికి వెల్దాము.ఈ దినపు వాక్యము :మనమింకా గ్రహించని మనలోని  సందేహాలు!
.
సాధారణముగా ప్రతి విశ్వాసిలో ఇలాంటి ఆలోచనలు సందేహాలు ఉంటూనే ఉన్నాయి,అయితే కొందరు వాటికి గ్రహించి విడిచిపెడుతున్నారు .మరికొందరేమో వాటిని గ్రహించలేక వాటివలన ఎంతో నష్టపోతూ చివరికి దేవుని విడిచిపెడుతున్నారు ,సమరయ స్త్రీ ని గురించిన భాగములో ప్రభువు ఆమెను  దర్శించిన సంగతి మనందరికీ చాల సుపరిచితమే.ఆమె పొందిన ప్రత్యక్షత చాల ఆశ్చర్యకరం !ఆమె ఆలోచనలలో  అడుగడుగునా  మార్పులు ఎదుగుదల కనపడుతూనే ఉన్నాయి.అలాగే ఆమెలోని లోపములు కూడా ఎంతో జ్ఞానముతో సరిచేయబడినవి,గమనించండి ,దేవుని జ్ఞానము మనలను చక్కపరుస్తుంది.ఆ జ్ఞానము మనలను చక్కని మార్గములో నడిపింపచేసి ,ప్రవర్తింపచేస్తుంది .సామెతలు నాలుగవ అయిదవ అధ్యాయములో దేవుని జ్ఞానము మనలను ఎలా కాపాడుతుందో ఒక ఆశ్చర్యమైన వివరణ కనపడుతుంది .ఒకసారి చదివి చూడండీ.




సరే ఈ సమరయ  స్త్రీ విషయానికి వస్తే ఆమెలో ఒక సందేహము గమనిస్తాము! 
యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్లివ్వమని అడుగుచున్నావు?ఈలాగున ఆమెలో చాల రకముల ప్రశ్నలున్నాయి.కానీ వాటిల్లో సందేహము కూడా ఉన్నాయి.ఒక సందేహమును గురించి మన ధ్యానము చేద్దాము,అదే:చేసుకొనుటకు నీ యొద్ద ఏమియు లేదే? నాకెలా జీవజలములు ఇస్తావు?

ఆమె ప్రభువు నమ్ముతుంది ,యాకోబు కంటే గొప్పవాడని,ఆయన ఒక ప్రవక్తని  అన్నింటిని మించి నమ్ముతుంది కానీ ఆమెలో సందేహము!ఇలాగే మన జీవితములో కూడా ప్రభువు గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి.అయితేవాటిని మనం ఇంకా గ్రహించలేదు .ఆయన చేయగలడా?వింటున్నాడా?చూస్తున్నాడా?వస్తాడా?మాట్లాడుతాడా?అసలు ఈ కార్యము చేయగలడా?అని ఆయన సామర్ధ్యతను గురించి ఎన్నో సందేహాలున్నాయి,అవింకా మనలోనుండి బయల్పరచబడలేదు,ఇంకా మనలో నిలిచియున్నాయి?ఒక ప్రక్క నమ్మకముంటుంది కానీ ఈ సందేహాలు కూడా అలాగే ఉంటాయి,కానీ ఈ ప్రశస్తమైన సమయములో దేవుని బిడ్డా నువ్వ్వు వాటినన్నింటిని గెలవాలి.
Dear Beloved One in the Lord, there shouldn't be any misgivings, misunderstandings between you and your Lord. right? There must not any of your short-comings ,which hinders JESUS to draw close to you. Remember that, and please work on your relation with Him.


ఒక ప్రక్క నమ్మకముంటుంది కానీ ఈ సందేహాలు కూడా అలాగే ఉంటాయి,కానీ ఈ ప్రశస్తమైన సమయములో దేవుని బిడ్డా నువ్వ్వు వాటినన్నింటిని గెలవాలి.ఆమె వాటినన్నటిని దాటుకుని ప్రభుని విశ్వాసించించి అడిగింది...అయ్యా నేను మరెన్నడు దప్పిగొనకుండా ఆ నిత్య జీవపు జలములు నాకివ్వు అని అడుగు.ప్రభు ప్రత్యక్షత పొందింది.దేవుని బిడ్డా ! నీవు కూడా నీ సందేహాలన్నీ దాటుకుని ప్రభుని విశ్వసించు నీవు ఆ ప్రత్యక్షత పొందుతావు.ప్రభు సహాయపడతారు.చాలా మంది నేను దేవునినెందుకు సందేహిస్తాను అనుకుంటారు?కానీ వారిలో అలాంటివి ఉండేఉంటాయి.ఒకటే గుర్తు ఆ సందేహాలు మనలో ఉండగా దేవుని కార్యము జరగడము అసాధ్యము.ఆదికాండము 18 వ అధ్యాయములో దేవుడు శారాను దర్శించిన కారణముగా అదే ,శారాలో ఇంకా దేవుని కార్యము జరగకపోవడానికి కారణము అదే.దానిని వెళ్లగొట్టడానికి ఆమెకి దేవుని ప్రత్యక్షత ఎంతో అవసరము,నిజంగా ఎంత కనికరముగల దేవుడు!యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా? అవును కదా దేవు ఐకి అసాధ్యము  ఏముంది? నీలోనున్న ఆ సందేహములన్ని అవిశ్వాసమంతా కడుగబడాలని దేవుని ప్రత్యక్షత నీ హృదయములో వెలిగింపబడాలని వేడుకొ.

దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక !ఆమెన్ ఆమెన్ ఆమెన్.


                                                                             ✍స్టెఫీ బ్లేస్సీనా 


Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena