Posts

Showing posts from March 12, 2023

వాగ్దాన-నెరవేర్పు-పరిపక్వత

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు మనందరి జీవితములో కనపడే ఓ చిన్న విషయము ధ్యానం చేసుకుందాము.ఎందుకంటే అది చాలా స్వల్పమైనది,సాధారణముగ మనము గ్రహించలేనంత సూక్ష్మమైనది.దానిని మన జీవితములో సరి చేసుకొని,చక్కపరచుకుంటే మన మార్గాలు సరళమైనట్లే.మనలో ప్రతి వ్యక్తి,దేవుని పరిశుద్ధ వాక్యమును చదివే ప్రతి వ్యక్తి,చదువబడిన ఆ వాక్యపు నేరవేర్పుకోరకు ఆశపడతాము,చాలా ఎదురుచూస్తాం.కానీ చివరికి ఆ నేరవేర్పు మన కన్నుల ఎదుటే ప్రత్యక్షపరచబడితే దానిని పొల్చుకోలేక,తట్టుకోలేక,నమ్మలేక,మనలను ఆ నేరవేర్పులో చూచుకోనలేక....ఎన్ని నేరవేర్పులను మన జీవితంలో కోల్పోయి యుంటామో!Ii ఈ విషయములో ఎంత మంది నాతో అంగీకరించగలరు? Comment about yourself. ✓📖సంఖ్యాకాండము 13: 27 వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి. ✓📖సంఖ్యాకాండము 13: 31 ​అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. ✓📖సంఖ్యాకాండము 13: 32 ​​మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ...