నా దేవా నీదు నివాసములు-song lyrics
నా దేవా నీ నివాసములు నా దేవా నీదు నివాసములు - నా రాజా నీ సహవాసములు పరికించుచున్నవి ఆత్మనేత్రాలు-నీ దివ్య మహిమ ప్రదేశమును కాంక్షించుచున్నవి ప్రాణాత్మదేహములు- నీ దివ్య జీవ జలధారలు నా ప్రాణమింకా తృష్ణగొనుచున్నది-వినగోరి యేసుని ప్రియ వాక్కులు... 1.నీ సంఘవధువుగా నను కోరినావా- నీ ప్రేమ నాపై చూపించినావా నీ రాక కోసం నన్ను సిద్ధపరచి-ప్రతి డాగు ముడుతలు సరిచేసినావా నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య 2.నను రాకుమారిగా నీ మహిమలోన- నీ మందిరమున నను దాచినావా పరిశుద్ద నీతి వస్త్రాలతోడ-చెలికత్తెలందరు నను సిద్ధపరచ నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య 3.నీ నామమే పరిమళతైల తుల్యము- నీ ప్రేమయే తియ్యని ద్రాక్ష ఫలము అతి సుందరుండ అతి కాంక్షణీయుడ- నీ విడిది గదిలో నేనుంటిని నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య Song sung by Dr.Amshumathi Mary Darla