నా దేవా నీదు నివాసములు-song lyrics

               నా దేవా నీ నివాసములు

నా దేవా నీదు నివాసములు - నా రాజా నీ సహవాసములు
పరికించుచున్నవి ఆత్మనేత్రాలు-నీ దివ్య మహిమ ప్రదేశమును
కాంక్షించుచున్నవి ప్రాణాత్మదేహములు- నీ దివ్య జీవ జలధారలు
నా ప్రాణమింకా తృష్ణగొనుచున్నది-వినగోరి యేసుని ప్రియ వాక్కులు...

1.నీ సంఘవధువుగా నను కోరినావా-
నీ ప్రేమ నాపై చూపించినావా
నీ రాక కోసం నన్ను సిద్ధపరచి-ప్రతి డాగు  ముడుతలు సరిచేసినావా
నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య

2.నను రాకుమారిగా నీ మహిమలోన- 
నీ మందిరమున నను దాచినావా
పరిశుద్ద నీతి వస్త్రాలతోడ-చెలికత్తెలందరు నను సిద్ధపరచ
నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య
3.నీ నామమే పరిమళతైల తుల్యము-
నీ ప్రేమయే తియ్యని ద్రాక్ష ఫలము
అతి సుందరుండ అతి కాంక్షణీయుడ- నీ విడిది గదిలో నేనుంటిని
నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య

Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena