Posts

Showing posts with the label Christ

ఆయనే మానవుడు కావటం -He Himself Becoming Man

Image
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారము ఆయనకే! ✓ఆయనే మానవుడు కావటం ఆయన దీనత్వానికి పరాకాష్ఠ, మచ్చలేని ఆశీర్వాదంలో ఆయన అనంతుడు; ఐశ్వర్యవంతుడు, నైతికతలో కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రకాశత ఆయనది.అనుదినం పాపితో సంబంధం కలిగి ఉండటం మన మలిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయనను తాకటం ఎంత వేదనకరం.  ✓ఎడతెగక ఈ జాతి దయనీయత, ఆయనను ఆవరించటం! దాని కొరకు ఆయన మరణించటం! జీవదాత అందరిని దరికి చేర్చేందుకు సమాధికి వెళ్లటం! దేవుని కుమారుడు మానవుల చేతుల్లో అవమానాన్ని,బాధలను పొందుతూ మరణం పొందటానికి విధేయుడు కావటం! ఇది నిజ దీనత్వం. ఓ దు:ఖం, శ్రమల రాజా! ముఖం వికారంగా మారిన సార్వభౌముడా!నీవు వెళ్లిన ఆవేదనలోనికి ఎవ్వరూ వెళ్లలేదు. నీకే మహిమను చెల్లిస్తూ,మేము నీ ఎదుట తలవంచి మోకరిస్తున్నాము. మేము కన్నీటిచేత మూల్గుల చేత జయించబడ్డాము;  ✓మా హృదయాలు చిక్కుకున్నాయి; మా అంతరంగాలు ప్రభావితమయ్యాయి. నీవు చెల్లించిన వెలలేని మూల్యానికి, ఉద్దేశానికి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. క్రీస్తు యథేచ్ఛగా తనకు తానుగా ఎలా లొంగిపోయాడో గుర్తుంచుకో. ✓హతసాక్షి ఏం చెయ్యలేడు గ...