ఆయనే మానవుడు కావటం -He Himself Becoming Man

యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.
సర్వాధికారము ఆయనకే!
✓ఆయనే మానవుడు కావటం ఆయన దీనత్వానికి పరాకాష్ఠ, మచ్చలేని ఆశీర్వాదంలో ఆయన అనంతుడు; ఐశ్వర్యవంతుడు, నైతికతలో కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రకాశత ఆయనది.అనుదినం పాపితో సంబంధం
కలిగి ఉండటం మన మలిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయనను తాకటం ఎంత వేదనకరం. 

✓ఎడతెగక ఈ జాతి దయనీయత, ఆయనను ఆవరించటం! దాని కొరకు ఆయన మరణించటం! జీవదాత అందరిని దరికి చేర్చేందుకు సమాధికి వెళ్లటం! దేవుని కుమారుడు మానవుల చేతుల్లో అవమానాన్ని,బాధలను పొందుతూ మరణం పొందటానికి విధేయుడు కావటం! ఇది నిజ దీనత్వం.
ఓ దు:ఖం, శ్రమల రాజా! ముఖం వికారంగా మారిన సార్వభౌముడా!నీవు వెళ్లిన ఆవేదనలోనికి ఎవ్వరూ వెళ్లలేదు. నీకే మహిమను చెల్లిస్తూ,మేము నీ ఎదుట తలవంచి మోకరిస్తున్నాము. మేము కన్నీటిచేత మూల్గుల
చేత జయించబడ్డాము; 

✓మా హృదయాలు చిక్కుకున్నాయి; మా అంతరంగాలు ప్రభావితమయ్యాయి. నీవు చెల్లించిన వెలలేని మూల్యానికి, ఉద్దేశానికి మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. క్రీస్తు యథేచ్ఛగా తనకు తానుగా
ఎలా లొంగిపోయాడో గుర్తుంచుకో.

✓హతసాక్షి ఏం చెయ్యలేడు గనుక మరణించాడు; క్రీస్తు సర్వశక్తిమంతుడైనా దానిని ఎంచుకున్నందువలన
మరణించాడు. తన జీవితాన్ని తనంతట తానే ఫణంగా పెట్టాడు, ఎవరూ దానిని ఆయన నుండి తీసివేయలేరు.
ఆయన తిరుగుబాటు చేస్తే వెనుతిరిగి, పన్నెండు సేనావ్యూహముల దేవదూతల సైన్యాన్ని పిలిస్తే తన సంయుక్త శిరసత్వం యొక్క శక్తిచేత
జయపతాకాన్ని ఎగరవేయవచ్చు కానీ ఆయన భరించాడు, ఆయన మాటలు వినండి "నీ చిత్తమే, నా చిత్తము కాదు".

 ✓ఇదే ఆయన ఉద్దేశాలకు మహిమ
కరమైన ఊరటనిచ్చింది. ఆయన చాళ్లు చాళ్లుగా దున్నేందుకు తన వీపును,గడ్డపు ప్రక్కలు పెరికివేసేందుకు ఉమ్మివేసేందుకు ముఖాన్ని అప్పగించుకున్నాడు; నిందకు, అవమానానికి గురయ్యాడు.

 ✓అది చూచిన మన హృదయాలు ఆయనకు అంకితమయ్యాయి. ఒకానొకరోజు ఉమ్మివేయబడిన ఆ ముఖం ఎదుట ఈ భూమి ఆకాశం కూడా ఎగిరిపోతాయి.యేసు మనకోసం సమస్తం అర్పించుకున్నాడు. మనపై ఆయనకు హక్కుంది, ఎందుచేతనంటే తన రక్తంచేత మనలను కొన్నాడు. కానీ అయ్యో!ఆయన రుణం ఇంకా అలా నిలిచే ఉంది! ఆయన అందరి కొరకు చెల్లించాడు,మన నుండి కొంచెం సమయాన్ని, శక్తిని, సంపాదనను కోరుతున్నాడు.
సమర్పణ అనే కార్యం వద్ద గతంలో మనం దోచుకున్న దానికి క్షమాపణ కోరదాం. 

✓మన ఆశలన్నీ సంపూర్ణంగా ఆయన కొరకే; ఆయన బానిసలమైన మనకు ఆయనే యజమాని, ఇంకెవ్వరూ లేరు.నిజాయితీగా మనం ఈ మాట అంటూ ఉండగానే ఆయన మన నిజాయితిని పరీక్షిస్తాడు. ఆయన యవ్వనస్థుడైన ఆ అధికారిని అడిగినట్లే అడుగుతాడు.
✓మనలో ఉన్న ఏదో ఒక దానిపై వ్రేలుపెట్టి, ఏది మనకు దూరం చెయ్యాలని తలంచుతాడో, ఆ ఆజ్ఞకు విధేయత చూపటం, చనువుగా ఉండేచోటును
విడిచిపెట్టుకోవటం, మనం భేషరతుగా ఆయన చిత్తానికి మన త్రోవలను అప్పగించుకుని ఇరుకు మార్గం గుండా ప్రయాణించి, లోబడుట అనే అంతఃగృహము చేరుకుంటాము.అక్కడ నిరంతరం వీచే దక్షిణ వాయువుచే వెచ్చగా ప్రకాశమానమైన ఆయన సన్నిధిలో ఉంటాం. ఎందుచేతనంటే ప్రత్యక్షపర్చబడిన ప్రేమకు విధేయతే షరతు (యోహాను 14:23).
~Fredrick Brotherton Mayer.
@సేకరించబడినది.

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA