క్రీస్తులో-క్రీస్తువలె || In Christ-Christ Like
యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు యేసులో యిప్పుడ ఏదైతే దేవుడు యిచ్చాడో దానికన్న ఎక్కువగా దేవుడు యివ్వడు! నీవు ఎంతగా దీవించబడ్డావంటే, పరలోకం ఏదైయితే యివ్వగలిగిందో అదంతా యివ్వబడింది! నీవు నీతిమంతుడవుగా, పూర్తిగా క్షమింపబడినవాడుగా, దేవుని కుమారునిగా మార్చబడినావు, ఆయన నిన్ను యిష్ట పడుచున్నాడు. ఆయన నీ స్వరము వినాలనీ, అది మధురమైంది అని చెప్పాలనీ కోరుతున్నాడు. ( పరమ గీతాలు 2:14). నీవు తండ్రియొద్దకు వచ్చినప్పుడు క్రీస్తువలే కనబడుతావు! తన కుమారుడైన యేసును తండ్రీ ఏవిధంగా స్వీకరిస్తాడో, అలాగే నీవు కూడ క్రీస్తులో, క్రీస్తువలే స్వీకరించబడుతావు! (ఎఫెసీ 1:6). క్రైస్తవునిగా నీకున్న వారసత్వం, నీవు క్రీస్తువలే మారుట! తండ్రీ కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నడంటే. తన కుమారినిలాగ వున్న వారందరి చేత పరలోకంలో నిలుపుటకు ఆశ కల్గివున్నాడు. తన కుమారిని వలే నిన్ను...