Independency-Dependency
ఒక వ్యక్తి దేవుని వాక్యముయొక్క సంపూర్ణాధికారము క్రిందకు ఇష్టపూర్వకంగా రాగలిగినప్పుడే అతడు స్వాతంత్ర్యుడు.ప్రభువును విశ్వసించిన ప్రతి వ్యక్తీ అనగా ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వ్యక్తీ చనుపాలు విడిచినపిల్ల తల్లిని అంటుకొనియుండునంతగా దేవుని వాక్యముమీదను,దేవుని ఆత్మ యందును అంతగా,అంతకంటే ఎక్కువగా ఆధారపడతారు. అలాగని అంతగా దేవుని వాక్యము మీద ఆధారపడడము తప్పుకాదు,మన చేతకానితనముకాదు.📖 యోహాను 15: 7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన మాటలు మనయందు నిలిచియుండుట అంటే ఎలా?మనము మనలో ఆ మాటలను ఎలా నిలుపుకోగలము?దేవుని మాటలను నమ్మడం ద్వారా.దేవుని మాటలు పవిత్రమైనవి మరియు నమ్మదగినవి,నిర్మలమైనవి.📖 కీర్తనలు-19;7,8. అన్నీ తెలుసు అనెడి అంధకార మనస్సు నుండి దేవుడు మనలను విడిపించాలని మనవి చేయాలి.ఆ మనస్సు మనలను అంతకంతకు ప్రభువుకు దూరం చేస్తుంది.మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యము మీదనే ఆధారపడాలి. దేవుని వాక్యము సంపూర...