Independency-Dependency

ఒక వ్యక్తి దేవుని వాక్యముయొక్క సంపూర్ణాధికారము క్రిందకు ఇష్టపూర్వకంగా రాగలిగినప్పుడే అతడు స్వాతంత్ర్యుడు.ప్రభువును విశ్వసించిన ప్రతి వ్యక్తీ అనగా ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వ్యక్తీ చనుపాలు విడిచినపిల్ల తల్లిని అంటుకొనియుండునంతగా దేవుని వాక్యముమీదను,దేవుని ఆత్మ యందును అంతగా,అంతకంటే ఎక్కువగా ఆధారపడతారు.
అలాగని అంతగా దేవుని వాక్యము మీద ఆధారపడడము తప్పుకాదు,మన చేతకానితనముకాదు.📖యోహాను 15: 7
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
ఆయన మాటలు మనయందు నిలిచియుండుట అంటే ఎలా?మనము మనలో ఆ మాటలను ఎలా నిలుపుకోగలము?దేవుని మాటలను నమ్మడం ద్వారా.దేవుని మాటలు పవిత్రమైనవి మరియు నమ్మదగినవి,నిర్మలమైనవి.📖కీర్తనలు-19;7,8.
               అన్నీ తెలుసు అనెడి అంధకార మనస్సు నుండి దేవుడు మనలను విడిపించాలని మనవి చేయాలి.ఆ మనస్సు మనలను అంతకంతకు ప్రభువుకు దూరం చేస్తుంది.మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యము మీదనే ఆధారపడాలి.
               దేవుని వాక్యము సంపూర్ణముగా మనలను ఏలుబడి చేయాలి.మనస్సు,తలంపులు ఉద్దేశ్యాలు,నిర్ణయాలు,ఆశలు,కోరికలు....అన్నీ మన సర్వాంగ దేహాన్ని ఏలుబడి చేయాలి.మనలో ఇంకొక మనస్సు ఉంటుంది అదేమనగా బిలాము మనస్సు!
               📖సంఖ్యాకాండము-22:9-20
బిలాము మొదటిమారు ప్రార్ధించగా,దేవుడు తన మనస్సులోని మాటను అనగా తన చిత్తాన్ని తెలియపరిచారు.ఆ తరువాత బిలాము మరల ప్రార్ధించాడు,అంటే మొదట చెప్పిన మాటను దేవుడు మార్చుకొని మరల మాట్లాడుతారా?ఆయన పరిస్థితిబట్టి,మనిషి స్థితి-గతులనుబట్టి మాట మార్చువాడా?లేదు కానీ.బిలాము దేవుని మాటను సంపూర్ణముగా ఒప్పలేకపోయాడు.ఇష్టపూర్వకంగా ఆయన మాటను నమ్మి-అంగీకరిస్తే మరల అనే మాటకు తావుండదు.కాని అదే ఇప్పటి దినాల్లో కష్టముగా ఉంది.అందుకే దేవునివాక్యము విషయములో మనము స్వతంత్రులుగా లేము.ఇది ఎంతైనా వాస్తవము.దేవుని వాక్యము చదివేటపుడు,వినేటపుడు,నమ్మేటపుడు,మాట్లాడేటప్పుడు నిజంగా ఆ వాక్యాదిరములో ఉండగల్గుతున్నామా?లేక మన ఇష్టము,కోరిక,ఆశ,అవసరత చొప్పున చదివి మనల్ని మనమే గెలిపించుకుంటున్నామా?లేదు.మనము దేవుని వాఖ్యాధికారానికి సంపూర్ణాగీకారముతో సర్వాంగదేహముతో ఒప్పుకొనాలి.అదియే మన వ్యక్తిగతః స్వాతంత్ర్యము.పరిశుద్ధాత్మ దేవుడు .మనకు సహాయం చేస్తారు.ఆమెన్ .ఆమెన్.ఆమెన్
 ~StephyBlesseena.

Comments

  1. Truly the Dependence upon the LORD is a true Blessing one could ever have.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA