"నిలిచియుండుట"అంటే...."కొనసాగడము"~StephyBlesseena



మన ప్రభువును  రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు నా హృద పూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను.ప్రియులారా..మీరందరు బావున్నారా?మంచిది దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయములో ఓ ప్రత్యేకమైన భాగమును గురించి ధ్యానించుదాము.


యోహాను-15:4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.


ఖచ్చితంగా, 4-5 వచనాలలో ఉన్న విషయాన్నీ మనము సులభముగా  ఇక్కడ అర్థముచేసుకోవచ్చు : తీగెలు,కొమ్మలు (అంటే మనం) ద్రాక్షావల్లికి (అంటే ప్రభువునకు )అనుసంధానించబడి ఉండాలి ఎందుకంటే అవి  అలాగే ఫలిస్తాయి; ద్రాక్షావల్లి లేకుండా,మనం ఏమీ చేయలేము. మనం ఆ ద్రాక్షావల్లిలో ఖచ్చితముగా అంటుకట్టబడాలి.. ఇది మనం గ్రహించడము  చాలా ముఖ్యం. ఆ ద్రాక్షావల్లిలో  నిలిచి ఉండని కొమ్మ వాడిపోయి చనిపోతుంది, ఈ సత్యము  ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. యోహాను 15 లోని యేసుప్రభువారి  మాటలకు మనం విధేయత చూపకపోతే , ఖచ్చితముగా మనం  కూడా వాడిపోయి ఎండిపోయి చచ్చిపోతాము.ఏమీ చేయలేము.

క్రైస్తవులము అని పిలువబడి మనము చాలా సందర్భములలో మన ప్రభువునకు మనకు మధ్య దూరము కనబడుట చూడగలము .మన ప్రభువు ఒక మాట మాట్లాడినపుడు ...ఆ మాటను మనము విశ్వసించేంతవరకు,గ్రహించేంత వరకు ,దానికి విధేయత చూపేంతవరకు....మన హృదయములో ...ఎంత దూరము ఏర్పడుతుందో?కదా!కానీ "నిలిచియుండుట"అంటే...."కొనసాగడము".

మనము విశ్వసించుటలో "కొనసాగాలి",మన నమ్మకము కొనసాగాలి,మన ప్రేమ కొనసాగాలి,మన సహనము కొనసాగాలి,మన విధేయత కొనసాగాలి.....అది ఏ మూలముగానైనా,ఏ కారణముగా అయినా ఆగిపోగూడదు.చల్లారిపోగూడదు.ఒకవేళ ఆగిపోతుంది అంటే...నీవు ద్రాక్షావల్లిలో నిలువలేదు.ఇంకా మరో మాటలో చెప్పాలంటే...ద్రాక్షావల్లియైన క్రీస్తు  ఆత్మలో నీవు కొనసాగాలి.ఆ జీవజలముల ఊటలో నీవు నిలిచియుండాలి.

నీవా ద్రాక్షావల్లిలో నిలిచియున్నంత  వరకు....ఒక  చెట్టులో....అంటుకట్టబడియున్న కొమ్మ ,ఆ చెట్టు    లోని నీరు,బలము,సారము పీల్చుకుని బలమొంది పువ్వులు,పండ్లు ఇవ్వగలిగేట్లు నీవు కూడా..ఆ ద్రాక్షావల్లియైన ప్రభు సారము...ఆయన ఆత్మ ఫలములను పీల్చుకుని ,నీవే ఆ ఫలములను ,ఫలించగలవు.అందుకోసమే....ఆయా ద్రాక్షావల్లిలో నీవు నిలిచియుండాలి.ఆయన ఆత్మలో ...ఆయన మాటలో నీవు కొనసాగాలి.

అయితే చాల మంది ఆరంభములో వెంబడిస్తారు,ఆయన మాటలో కొనసాగుతారు....అంటే వెంబడిస్తారు.కానీ....ముందుముందుకు వెళ్ళేకొలది,కొనసాగింపు ఆగిపోతుంది.కొనసాగడము అంటే వెంబడించుట అనే మాట కూడా వస్తుంది...కదా! 1సమూయేలు -15:11. "సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను" గనుక ఈ భాగములో సౌలు మనస్సు ,అతని హృదయము దేవుని వెంబడించుట ఎన్నడో.....ఆగిపోయింది....కానీ తనకు తెలియదు.రాజుగానే కోనసాగుతున్నాడు కానీ...తన మనస్సు దేవుని చిత్తములోనుండి...ఆయన ఊటలో నుండి ఎప్పుడో  withdraw అయిపోయింది ....ప్రియ దేవుని బిడ్డ...ఒకసారి నీ మనస్సు ఎలా ఉందొ ,నీ హృదయము ఎలా ఉందొ ఆలోచన చేసుకొని చూసుకో..నీ మనస్సు ప్రభు ఆత్మలో కొనసాగుచున్నదా?...లేక సౌలు వలె దేవుణ్ణి, ఆయన ఆత్మను,ఆయన మాటను,ఆయన ఊటను వెంబడించుట వెనుకతీసిందా...ఆగిపోయిందా?పరీక్షించుకుని ...మరల ఆయనలో నిలిచియుండుటకు....ఆయన మాటలో నిలిచియుండుటకు..ప్రయాసపడు.నీవాయనలో నిలిచియుంటేనే ..నీ ప్రాణానికి ,నీ జీవితానికి ఒక విలువ...ఓ అందము.లేనియెడల..నీవొక..వ్యర్ధమే.నీవొకవేళ  ఆయన ఇచ్చిన మాటలో నిలిచియుండటానికి  అలసిపోయావేమో...ఈ ప్రశస్తమైన సమయములో ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నారు,నీవు నిలిచియుండాలి,కొనసాగాలి.

దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక !ఆమెన్ ఆమెన్ ఆమెన్.

                                                                                   

                                                                                                    స్టెఫీ బ్లేస్సీనా

Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena