యోహాను "నిలిచియుండుట"అనే మాటను ఎందుకు అంత ఇష్టపడ్డాడు? Stephy Blesseena



యేసుప్రభువారి పరిశుద్ధ నామములో దేవునికత్యంత ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.ప్రియులారా !మీరందరు బావున్నారా?మీ ఆత్మీయ జీవితములో విశ్వాస విషయములో,ప్రార్ధన విషయములో,నిరీక్షణ విషయములో ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో లేదా...వాట్సాప్ లో అయినా మీరు  పంచుకొనవచును.ఈ ప్రత్యేక ఉదయకాల సమయములో..ప్రతి దినము ఈలాగున ఓ నూతనమైన వాక్యంతో మీ ముందుకు రావడానికి మన ప్రభువు నా కిచ్చిన కృపను బట్టి నేనాయనను ఎంతో స్తుతిస్తున్నాను.మంచిది .ఈ ప్రశస్తమైన సమయములో దేవుని వాక్య భాగములోనుండి ఒక చిన్న మాటను ధ్యానము చేసుకుందాము.


 యోహాను 3:24 "ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము."

                              "నిలిచియుండుట"

యోహాను "సువార్తలోను"పత్రికలలోనూ" నిలిచియుండుట అనే మాటను  60 సార్లు  ఉపయోగించుటను గురించి మనము గమనించవచ్చు.అయితే  ఎందుకు ఆ మాటకు అంత ప్రాధాన్యము ఇవ్వబడింది? "నిలిచియుండుట"అనే మాటకు యోహాను శైలిలో భావమేమి?

 పరిశుదా గ్రంథమంతటిలో "నిలిచియుండుట" అనే మాట 118 సార్లు వ్రాయబడినది.
యోహాను సువార్తలో 40 సార్లు,
1 యోహాను పత్రికలో 24 సార్లు 
2 యోహాను పత్రికలో 3 సార్లు
ప్రకటన గ్రంధములో 1 సారి వ్రాయబడినది.

"ఆయనయందు నేను", "నాయందు ఆయన",తండ్రి నా యందు ,నాయందు తండ్రి,..."మేమిద్దరమూ ఏకమై యున్నాము",అనే మాటలు యోహాను వ్రాసిన సువార్తలో,పత్రికలలో నే ఎక్కువగా మనము కనుగొంటాము.

ఆది లోనున్న వాని....ప్రత్యక్షత కలిగిన వ్యక్తి.....ఆయనలో "నిలిచియుండుట"అనే అద్భుతమైన....అనుభవాన్ని బాగుగా ఎరిగియుంటాడు .ఎందుకంటె ..తన వునికి ఆయనలోనుండే ప్రారంభమైనదని కనుగొంటాడు.
✓1 యోహాను 1:1 
జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.

✓ఎఫెసీయులకు 1:4-6 
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
మనము క్రీస్తులో పోలికలోను,స్వభావములోను,క్రీస్తులోను నిర్మింపబడి -ఆయన చేసిన పనియై యున్నాము.

"నిలిచియుండుట" -"Abide" -μένω(meno)   అంటే ఉండటం,ఉండటం, భరించడం.నిరంతర సంబంధం మరియు ఆధారపడటాన్ని  చెప్పడం, 
Abide means to"to remain,stay, continue,or endure,emphasizing a continued connection and dependence.

"నిలిచియుండుట"అనేది ఒక బంధము,ఇది విశ్వాసికి మరియు దేవునికి మధ్య సన్నిహితమైన మరియు శాశ్వతమైన సంబంధాన్ని సూచిస్తుంది.అబ్రహముతో దేవుడు చేసిన ప్రమాణము మీకు గుర్తుందా?
 ✓ఆదికాండము 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

"నాతోడని" చేసిన ప్రమాణము....మరల 15 వ అధ్యాయములో...ఆ మృత కళేబరముల మధ్యలో నడచిపోయి.....నేను నీతో చేసిన ప్రమాణము నేరవేర్చలేకపోతే....ఈ మృత కళేబరములతో సమానము...అని నా జీవము తోడు నేను చచ్చినంత ఒట్టు...అన్నట్లుగా."నీతో మాట్లాడిన..మాట నా ఊపిరి...నేను దానిలో నిలిచియుండాలి.....లేకపోతే నా ప్రాణం పోతుంది.ఆ మాటను నేరవేర్చకుండ ఉండలెను.

ఇంతటి బంధాన్ని దేవుడు మనతో కలిగియున్నారు.మనకు ఆయనకు ఉన్న బంధము అది.మనము ఆయనలో నిర్మింపబడి ఉన్నవారము.కాబట్టి ఆయనలో నిలిచియుండుటే మన జీవితానికి సంపూర్ణము.మన ప్రాణము,జీవము,జీవితము,ఆలోచనలు,తలంపులు,చిత్తము,నిర్ణయాలు....అన్నీ ఆయనలోనే ఉన్నాయ్,ఉండాలి.ఆయనకు వేరైనది ఏదైన పాపమే.అందుకే యోహాను.....ఆయనలో నిలిచిందని...అంతగా ఆశపడుతున్నాడు.ప్రియమైన దేవుని కుమారుడా,కుమార్తే....నీవు కూడా ఆయనలో నిలిచియుండాలని...ఆశపడాలి.నీ ప్రాణము ఆయనలో....ఉన్నది.
  *జీవితానికి అర్ధము ...వెదకుచున్న నీకు...."ఆయనలో నిలిచియుండుటే" జీవిత పరమార్ధము.
*నేను దేవునిలో ఎదగాలి.....అనుకునే వారికి ...ఆయనలో నిలిచుంటేనే అభివృద్ది.మరోక మార్గం లేదు.
*ఆయనలో నిలిచి యుండుట అనే లోతైనా ఆశీర్వాదము మీరు కూడా పొందుటకు..ప్రభు సహాయపడతారు.దేవుడు ఈ మాటలనే మనకొరకు దీవించును గాక.ఆమేన్ ఆమెన్.ఆమెన్.
~స్టెఫీ బ్లెస్సీనా 

Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena