"నిలిచియుండుట"అంటే...."కొనసాగడము"~StephyBlesseena
.jpg)
మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు నా హృద య పూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను.ప్రియులారా..మీరందరు బావున్నారా?మంచిది దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయములో ఓ ప్రత్యేకమైన భాగమును గురించి ధ్యానించుదాము. యోహాను-15:4 . నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ఖచ్చితంగా, 4-5 వచనాలలో ఉన్న విషయాన్నీ మనము సులభముగా ఇక్కడ అర్థముచేసుకోవచ్చు : తీగెలు,కొమ్మలు (అంటే మనం) ద్రాక్షావల్లికి (అంటే ప్రభువునకు ) అనుసంధానించబడి ఉండాలి ఎందుకంటే అవి అలాగే ఫలిస్తాయి; ద్రాక్షావల్లి లేకుండా ,మనం ఏమీ చేయలేము. మనం ఆ ద్రాక్షావల్లిలో ఖచ్చితముగా అంటుకట్టబడాలి.. ఇది మనం గ్రహించడము చాలా ముఖ్యం. ఆ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండని కొమ్మ వాడిపోయి చనిపోతుంది, ఈ సత్యము ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. యోహాను 15 లోని యేసుప్రభువారి మాటలకు మనం విధేయత చూపకపోతే , ఖచ్చితముగా మనం కూడా వాడిపోయి ఎండిపోయి చచ...