విజ్ఞాపనలో "స్తుతి"-"కృతజ్ఞతాభావము"-స్టెఫీ బ్లేస్సీనా..
.jpg)
యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుచున్నాము ,దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయములో పరిశుద్ధ లేఖనములలోనుండి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేద్దాము. ఫిలిప్పీ-4:6 " దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి." సాధారణముగా విజ్ఞాపన చేయునపుడు మనలో విశ్వాసాన్ని కూడకట్టుకోవడానికి ఎంతైనా ప్రయత్నిస్తాము,కానీ ఓ సంపూర్ణమైన విజ్ఞాపన లో విశ్వాసము ఎంత ఉంటుందో, కృతజ్ఞత కూడా అంతే ఉండాలి...... .మీ విన్నపములు ప్రార్ధన విఙ్ఞాపణలతో కృతజ్ఞతాపూర్వకముగా ఉండాలి. అసలు విజ్ఞాపనలో "స్తుతి"-"కృతజ్ఞతాభావము"....చాలా కష్టము కదా.మనం ప్రార్ధించినది మన కన్నులు చూసిన తరువాతనే...మనలో స్తుతి కలుగుతుంది. ఆ స్తుతి కలిగితేనే...కృతజ్ఞతాభావము ఏర్పడుతుంది.స్తుతి కలుగడము వేరు ,అలాగే కృతజ్ఞతాభావము కలుగడము వేరు...ఎందుకంటే...మేలు పొందిన ప్రతి వ్యక్తిలో కృతజ్ఞతాభావము ఏర్పడదు.మేలు పొందినపుడు..లేదా పొందనప్పుడు కూడా....విశ్వాసముచేత మనలో ఏర్పడే స్తుతి...కోనసాగాలి,అదే ...