విజ్ఞాపనలో "స్తుతి"-"కృతజ్ఞతాభావము"-స్టెఫీ బ్లేస్సీనా..
యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుచున్నాము ,దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయములో పరిశుద్ధ లేఖనములలోనుండి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేద్దాము.
ఫిలిప్పీ-4:6 "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి."సాధారణముగా విజ్ఞాపన చేయునపుడు మనలో విశ్వాసాన్ని కూడకట్టుకోవడానికి ఎంతైనా ప్రయత్నిస్తాము,కానీ ఓ సంపూర్ణమైన విజ్ఞాపన లో విశ్వాసము ఎంత ఉంటుందో, కృతజ్ఞత కూడా అంతే ఉండాలి.......మీ విన్నపములు ప్రార్ధన విఙ్ఞాపణలతో కృతజ్ఞతాపూర్వకముగా ఉండాలి.
అసలు విజ్ఞాపనలో "స్తుతి"-"కృతజ్ఞతాభావము"....చాలా కష్టము కదా.మనం ప్రార్ధించినది మన కన్నులు చూసిన తరువాతనే...మనలో స్తుతి కలుగుతుంది. ఆ స్తుతి కలిగితేనే...కృతజ్ఞతాభావము ఏర్పడుతుంది.స్తుతి కలుగడము వేరు ,అలాగే కృతజ్ఞతాభావము కలుగడము వేరు...ఎందుకంటే...మేలు పొందిన ప్రతి వ్యక్తిలో కృతజ్ఞతాభావము ఏర్పడదు.మేలు పొందినపుడు..లేదా పొందనప్పుడు కూడా....విశ్వాసముచేత మనలో ఏర్పడే స్తుతి...కోనసాగాలి,అదే కృతజ్ఞతాభావము.
సరే మంచిది..అసలు విజ్ఞాపనలో కృతజ్ఞత ఎలా కలుగుతుంది...?మన ప్రార్థనలో విజ్ఞాపనలో కృతజ్ఞతపూర్వకముగా చేయుట ఎలా ?మనము ఏదైనా విషయము కొరకు ప్రార్ధించునపుడు ....మనము దానిని పొందినంత విశ్వాసించాలి.పొందుతాము అని కాదు గాని,పొందినాము అన్నంత విశ్వాసము.అలాగే విశ్వాసించాలి నాయి చెప్తుంది పరిశుద్ధ గ్రంధము.
మార్కు:4
24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
అవును ప్రియా దేవుని జనాంగమా..నీవు దేవుని కార్యాన్ని విశ్వసించాలి.విశ్వాసము అంటే దేవుని సామర్ధ్యాన్ని ,ఆయన వ్యక్తిత్వాన్ని నీవు గౌరవించడము.ఆయనను గౌరవించుటే నీవాయనను మహిమపరచడము.నీలో దేవుడు ఘనపరచబడాలి.అది నీ విశ్వాసమే చేయాలి.దేవుని కార్యము నీలో జరుగుతుందని విశ్వసించినపుడు,నీ శరీర నేత్రాలతో కాదు కానీ,ఆత్మీయ నేత్రాలతో,నీవా కార్యమును చూసి,ఆ కార్యము ననుభవించినంత సంతోషమునీలో కలుగగా..అప్పుడు కలుగుతుంది నీలో కృతజ్ఞత...విశ్వాసము కృతజ్ఞత నిస్తుంది.ఆలాగున నీలో కృతజ్ఞత నింపాలి నీ విశ్వాసము,ఆలాగున నీలో కృతజ్ఞత కలుగచేయకపోతే..నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి.అంటే దేవుడు మనలను ఊహలలో బ్రతుకమని చెప్తున్నారా?ఖఛ్చితముగా కాదు.అయితే...క్రీస్తును వెంబడించే ప్రతి వ్యక్తి ,నిరీక్షణ నేర్చుకోవాలి.నిరీక్షణ లేనిదే ఆ వ్యక్తి క్రీస్తును వెంబడించలేడు.నిరీక్షణ తో కూడిన విశ్వాసము పరిశుద్దమైనది.చాల మంది లో కార్యము పొందేంత,పొందగలిగేంత విశ్వాసము ఉంటుంది...కానీ కృతజ్ఞత కలిగియుండేంత విశ్వాసము ఉండదు.మరికొందరు...కార్యము పొందేంత విశ్వసిస్తారు,కానీ....కృతజ్ఞత నిండుకునేంతగా,స్థితిలో కొనసాగరు.ఈ ప్రశస్తమైన సమయములో ప్రియులారా.. మన ప్రార్ధన విఙ్ఞాపణల్లో విశ్వాసము మాత్రమే కాకుండా..కృతజ్ఞత కూడా ఉండేట్లు మనలను మనము సిద్ధపరచుకుందాము.దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్✍ స్టెఫీ బ్లేస్సీనా..
Comments
Post a Comment