మానవుని దృష్టిలో,దేవుని దృష్టిలో భక్తి అంటే.....?
భక్తి అనేది..ఈరోజుల్లో ఒక సామాన్యమైన,సులువైన కార్యమైపోయింది.చాలా సులభముగా ఎవరైనా చేయగలిగితే చౌక-cheapగా భావ్యమౌతుంది.ఒక పాట,ఒక మాట అర్ధమైతే చాలు ఇంకా అదే భక్తి అనుకోని మురిసిపోతున్నాము.కానీ భక్తి అంటే-దేవునితో నడవడం అంత సులభమా?భక్తి అంటే-దేవుని యెదుట నడువడం,భక్తి -దేవుని కోసము నడవడం,దేవుని పక్షముగా నడువడం అంత సులభమా? దేవుని కోరకు ప్రత్యేకించబడినవారే,దేవుని కోరకు వేరుపరచుకున్నవారే ,దేవుని కోరకైన సమర్పణ కలిగినవారే దేవుని కోరకు నడువగలిగె సామర్ధ్యము,బలము,శక్తి,ధైర్యము పొందుదురు. దేవుని భక్తులను గూర్చి పరిశుద్ధ లేఖనములో కీర్తనకారుడైన దావీదు ఈలాగు చెప్పుచున్నాడు, దేవుని చేత బోధించబడే అభ్యాసము కలిగినవారుగా ఉండాలనీ తన కోసము దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. *ఆయనయందు ఉపదేశించబడుట ....ఎఫెసీ-4:20,21 *ఆయన తన మార్గములను మనకు బోధించును .యెషయా-2:3 *ఆయన మనలను నడిపించాలి,మనకు నేర్పించాలి..అప్పుడే ఆది భక్తి అవుతుంది.ఆయన నిన్ను నడిపిస్తే సకల జ్ఞానము గూర్చి,సకల విద్యలు గూర్చి నేర్పుతారు.భక్తి ఎలాంటిదో,అది ఎలా చేయాలి నేర్పిస్తారు. నీ ప్రవర్తనా ఎలా ఉండాలో,నీ...