నీలోనున్నవాడు సర్వోన్నతుడు.
నీలోనున్నవాడు సర్వోన్నతుడు ప్రతీ విశ్వాసి సాతానుకు కొరకరాని కొయ్య.మన గురించి మనం పెద్ద"బెదిరింపు"గా పరిగణించుకోము,కానీ పరిశుద్ధుని రూపములో దేవుని శక్తి మనలను ఆవరించి శక్తిమంతులనుగా చేసినప్పుడు మనలను సాతానుడు ఏ దృష్టితో చూస్తాడన్నది అర్ధమవుతుంది. "నీలోనున్నవాడు సర్వోన్నతుడు"1 యోహాను 4:4 -"మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు" అన్నాడు అపో.యోహాను.మనము నడుస్తున్న అద్భుత శక్తులము,నడుస్తున్న యుద్ధపరికరాలము అని అంటున్నాడు. శత్రువుకు ఈ సంగతి తెలుసు కనుకనే కంపిస్తున్నాడు.దేవుడు మనలో నున్నడన్న వాస్తవాన్ని వాడెలాగూ మార్చలేడన్న సంగతి నిజం వానికితెలుసు.సార్వభౌమత్వము,నైతికత,న్యాయము,ప్రేమ,శాశ్వత జీవము సర్వజ్ఞత,సర్వవ్యాప్తిత్వము,నిర్వికారత(మార్పులేని)సత్యవాదిత్వము మొదలయిన సద్గుణములన్నీ పరిశుద్దాత్ముని ద్వారా మనకు సంక్రమించినవి. అయితే మన శత్రువుకు మరో విషయము కూడా తెలుసు.విశ్వాస్యత శైశవ దశలో నున్న మన'హృదయాల్లో "దేవుని వార్త"లేదన్నది వానికి తెలుసు. దేవుని పలుకు లేకుంటే మనకున్న ఈవులవల్ల ప్రయోజనం లేదు.యుద్ద ఖడ్గమైన ఆ దైవవాక్యమనే రెండంచు...