నీలోనున్నవాడు సర్వోన్నతుడు.

నీలోనున్నవాడు సర్వోన్నతుడు

ప్రతీ విశ్వాసి సాతానుకు కొరకరాని కొయ్య.మన గురించి మనం పెద్ద"బెదిరింపు"గా పరిగణించుకోము,కానీ పరిశుద్ధుని రూపములో దేవుని శక్తి మనలను ఆవరించి శక్తిమంతులనుగా చేసినప్పుడు మనలను సాతానుడు ఏ దృష్టితో చూస్తాడన్నది అర్ధమవుతుంది.

"నీలోనున్నవాడు సర్వోన్నతుడు"1 యోహాను 4:4 -"మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు" అన్నాడు అపో.యోహాను.మనము నడుస్తున్న అద్భుత శక్తులము,నడుస్తున్న యుద్ధపరికరాలము అని అంటున్నాడు.

శత్రువుకు ఈ సంగతి తెలుసు కనుకనే కంపిస్తున్నాడు.దేవుడు మనలో నున్నడన్న వాస్తవాన్ని వాడెలాగూ మార్చలేడన్న సంగతి నిజం వానికితెలుసు.సార్వభౌమత్వము,నైతికత,న్యాయము,ప్రేమ,శాశ్వత జీవము సర్వజ్ఞత,సర్వవ్యాప్తిత్వము,నిర్వికారత(మార్పులేని)సత్యవాదిత్వము మొదలయిన సద్గుణములన్నీ పరిశుద్దాత్ముని ద్వారా మనకు సంక్రమించినవి.

అయితే మన శత్రువుకు మరో విషయము కూడా తెలుసు.విశ్వాస్యత శైశవ దశలో నున్న మన'హృదయాల్లో "దేవుని వార్త"లేదన్నది వానికి తెలుసు.
దేవుని పలుకు లేకుంటే మనకున్న ఈవులవల్ల ప్రయోజనం లేదు.యుద్ద ఖడ్గమైన ఆ దైవవాక్యమనే రెండంచులుగల ఖడ్గము లేకుంటే  సాతాను నెదుర్కొనగల ఎటువంటి యుద్ధ సాధనము మనకు లేనట్టే;మనము ఎదిగి వృద్ధి చెందితే తప్ప మన ఆత్మలు నిలుకడగా ఉండలేవన్న విషయము సాతానుకు తెలుసు.
దేవుని ఆత్మ దేవుని వాక్యాల మధ్య సమతుల్యం సాతానును జయించే శక్తి.
కనుక సాతానును బెదిరించగల శక్తి మన నైతికాభివృద్ది.అందుచేత నైతికాభివృద్ది చెందాలని మనం తీసుకునే నిర్ణయాలను నిరోధించడానికి తానూ తన సర్వశక్తులూ,యుక్తులూ ప్రయత్నిస్తాడు.
-----సేకరించబడినది.


Comments

Popular posts from this blog

నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.

BOOK OF NUMBERS -Pastor Stephen

Neglected Responsibility of Aaron-Berachah Prayer Holy Fellowship