Posts

Showing posts with the label Israel Miriam Promised Land

వాగ్దానానికి బయట నిలిచిపోయిన మిర్యాము.Miriam-Stood outside the Promised Land.

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు🙏. మిర్యాయము జీవితములునుండి కొన్ని విషయాలని ధ్యానించుకుందాము. ✝️సoఖ్య కాండము-20:1 మిర్యాము కాదేషులో పాతిపెట్టబడినది.ఈ అధ్యాయములో మనము ఇస్రాయెలీయులు ఇంకా వాగ్దాన దేశములోనికి వెళ్ళినట్లు,ఇంకా యాత్రలో నున్నట్లు చూడగలము.అల యాత్ర లోనున్నప్పుడే మిర్యాము మరనించి పాతిపెట్టబడినది. ✓కానీ దావీదు అయితే తాను దేవుని దేశమునకు వెలుపల నుండకూడదు,మరణించకూడదు అని ఎంత విలపించాడో! 📖1సమూయేలు-26:19, 20 "నా దేశమునకు దూరముగాను, యెహావా సన్నిధికి ఎడముగాను నేను మరణము పొంద కపోవుదునును." ✓వాగ్దాన దేశములో చనిపాయి పాతిపెట్టబడుట ఆశీర్వాదం. *అయితే మిర్యాము - కాదేషు లో అనగా వాగ్దాన దేశానికి వెలుపల మరణించి పాతిపెట్టబడినది. కానీ విశ్వాస జీవితము అది కాదు. యోసెఫు విశ్వాసం ఎమిటంటే- 📖ఆదికాండము 50: 25 మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను. 📖నిర్గమకాండము 13: 19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను....