వాగ్దానానికి బయట నిలిచిపోయిన మిర్యాము.Miriam-Stood outside the Promised Land.

మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు🙏.
మిర్యాయము జీవితములునుండి కొన్ని విషయాలని ధ్యానించుకుందాము.

✝️సoఖ్య కాండము-20:1 మిర్యాము కాదేషులో పాతిపెట్టబడినది.ఈ అధ్యాయములో మనము ఇస్రాయెలీయులు ఇంకా వాగ్దాన దేశములోనికి వెళ్ళినట్లు,ఇంకా యాత్రలో నున్నట్లు చూడగలము.అల యాత్ర లోనున్నప్పుడే మిర్యాము మరనించి పాతిపెట్టబడినది.
✓కానీ దావీదు అయితే తాను దేవుని దేశమునకు వెలుపల నుండకూడదు,మరణించకూడదు అని ఎంత విలపించాడో!
📖1సమూయేలు-26:19, 20 "నా దేశమునకు దూరముగాను, యెహావా సన్నిధికి ఎడముగాను నేను మరణము పొంద కపోవుదునును."
✓వాగ్దాన దేశములో చనిపాయి పాతిపెట్టబడుట ఆశీర్వాదం.
*అయితే మిర్యాము - కాదేషు లో అనగా వాగ్దాన దేశానికి వెలుపల మరణించి పాతిపెట్టబడినది.
కానీ విశ్వాస జీవితము అది కాదు.
యోసెఫు విశ్వాసం ఎమిటంటే-
📖ఆదికాండము 50: 25
మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను.
📖నిర్గమకాండము 13: 19
మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడుదేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముక లను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.
📖యెహోషువ 24: 32
ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
✍️అంటే ఆ వాగ్దాన దేశము లో యోసేపు ఎముకలనుంచునట్లు ,వారు యోసేపు
ఎముకలను 40 సం.రాలు మోసి - కనాను లో పాతిపెట్టినారు.ఎంత స్థిర బుద్ధిని కనుపరిచారు వారు!ఎంత నిలకడగా ఉందీ వారి విశ్వాసము!
*మరి మన మాట మీదే మనకూ నిలకడ లేకుంటే - భక్తిలో నిలకడుంటుందా?
మాట అవునంటే అవునని, కాదంటే కాదని యుండవలెను.అని వాక్యము చెప్తుంది.
📖మత్తయి 5: 37
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి(లేక-కీడునుండి) పుట్టునది.మన మాటే మన జీవితము,మన మాటే మన ప్రవర్తన,personality.
📖కీర్తనలు-15:4
అతడు ప్రమాణము చేయగా- నష్టము కలిగినను
మాట తప్పడు.
📖కీర్తనలు101:3 భక్తి మార్గము తొలగిన వారి క్రియలు
నాకు అసహ్యములు.
నీ మాటకు అంత విలువుండాలి.
✍️సరే దేవుడంటున్నారు,
📖సంఖ్యాకాండము 14: 32,33
​అయితే మీ శవములు ఈ అరణ్య ములో రాలును.
​మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు.
        అది ఒక శాపము.
పితరులకు వాగ్దానము చేయబడ్డ దేశములో ప్రవేశింపక,వేలుపాలనుండగానే పువ్వు రాలినట్లు రాలిపోవడము శాపము కాదా!
- ఎంత భక్తి చేస్తున్నాము అనేది ముఖ్యము కాదు, 
దేవుని కృపను మన విశ్వాస జీవితాన్ని ఎంతగా కాపాడుకుంటున్నాము?
- మిర్యాము, పరలోకపు - ఆకాశపు మన్నా భుజించింది,
మేఘు- అగ్ని స్తంభాల కాంతిలో నడిచింది. కానీ ఏమి
ప్రయోజనం?
* ఆశీర్వాదాలు, అద్భుతాలను చూచిన, అనుభవించినా ఏమి ప్రయోజనం?
- ఎర్రసముద్రం దాటివచ్చినప్పుడు- ఎంతో ఉత్సాహంతో
నుంది,మిర్యాము విశ్వాసం,భక్తి చాలా బావుంది,కానీ
ఆమెలో అవి తరుగుతూ తరుగుతూ వచ్చి,చివరికి ఆమె - ఆశీర్వాద - వాగ్దాన దేశానికి
వెలుపలే మరణించి, వెలుపలే పాతిపెట్టబడినది.

✓నేను మిమ్మును వాగ్దాన దేశమునకు కొనిపోయెదను,
అని చెప్పిన దేవుడు, మిర్యాము విషయంలో ఎందుకు
చేయలేదు?
*ఆమె లోని అవిశ్వాసం, భక్తిహీనత, దేవుడు వెనుకంజ
వేయునట్లు చేసిందా?
- సాతాను సుళువుగా చిక్కులబెట్టు పాపంలో చిక్కించినప్పుడు,నీవు దాని నుండి విడుదల పొందుతున్నావా?
ఇప్పటికాల శ్రమను చూచి, రాబోయే మహిమను, కృపను
ఆశీర్వాదాన్ని పొగొట్టుకుంటే  ఏంత నష్టము!
యెహోషువా - 14:11 కాలేబు-"మోషే నన్ను పంపినప్పుడెంత బలము విశ్వాసము, భక్తికలధో ఇప్పుడు కూడా అలాగే ఉంది
- రాలిపోయిన వారి గుంపులో- యెహషువ, కాలేబులు
చేరలేదు.
* కానీ మిర్యాము రాలిపోయిన వారి గుంపులు చేరినది.
విశ్వాసాన్ని, కృపను పోగట్టుకొనువారముగా కాక
అలసట, నిసృత్తువ లేకుండా అనుదినము కృపను,
విశ్వాసాన్ని కాపాడుకుందాం!
సీయోను పురము చేరే - యాత్రికుని ప్రయాణమే మనది.
✓మన పితరులు 📖హెబ్రీయులకు- 11:13 
ఆ వాగ్దాన ఫలము అనుభవిపకపోయినను ..
విశ్వాసముగలవారై మృతిపొందితీరి.
✍️మనముకూడా రాలిపోయిన గుంపులో చేరిన మిర్యామువలె కాక,రాలిపోకుండా నిలిచినా కాలేబు,యెహోషువాలవలే,మనకూ మాదిరిగా నున్న ఎందరో పరిశుద్దులవలె..మన స్వాంత భక్తిని,విశ్వసాన్ని, కృపను కడు జాగ్రత్థతో కాపాడుకుందాం!
అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు సాయం చేస్తారు.ఆమేన్!!!🙏🙏🙏
~PastorStephen.


Comments

Post a Comment

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA