Standing Before God-Standing before the Enemy

మన ప్రభువైన ✝️యేసుక్రీస్తు✝️ పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.🙏🙏🙏.ఈ వాక్యము చదువుతున్న మీరు బాగున్నారని నమ్ముతున్నాను.మంచిది. వాక్య భాగములోనికి వెళ్దాము.
ఏలా లోయలో దావీదుకు -గోల్యాతుకు మధ్య జరిగిన యుద్దములో మరో విషయాన్ని ధ్యానించుదాం.
*1సమూయేలు 17: 40
​తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను.
*1సమూయేలు 17: 41
​డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి
*1సమూయేలు 17: 42
​చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.

     1.
Yours is the First Step-Your is the initiative.

శత్రువు వైపుగా,శత్రువుకు ఎదురుగా వేసే మొదటి అడుగు నీదే .
Whatever struggle or Goliath like Enemy is standing before you,remember You are the One who should walk towards the enemy. దావీదు శత్రువువైపునకు ,మరింత స్పష్టముగా ఆ ఫిలిష్ఠియుని చేరువకు పోయెను.విశ్వాసపు అడుగు నీదే అయియుండాలి.ఎందుకంటె *1యోహాను 4: 4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
అందుకనే మొదటి అడుగు మనది.శత్రువు మన కోర్టులోకివచ్చాడు కాబట్టి పట్టుకోవలసింది మనమే.అంతేగాని ఆ శత్రువు మన యెదుటకి వచ్చి నిలబడ్డంతమాత్రాన వానిదే పైచేయికాదు.
మనము వాని దేహ బలమో,వాని బుద్ధిబలమో,వాని సమయజ్ఞానమో చూడవల్సినపనిలేదు. శత్రువు తలలోని ఆలోచనలను మనముపసిగట్టాలని ధ్యానించాము కదా..Hit at the Forehead-నుదుటమీద కొట్టుట/తలలోని ఆలోచనల మీద కొట్టుట.
వాణి హృదయములోని రహస్యమైన సాతాను తలంపు మనము ఎరుగనివారము కాదు కదా .అలా దేవుని ఆత్మ సహాయముతో ,ఆ తలంపు ఆపవాది నుండివచ్చినది అని స్పష్టమైన నిర్ధారణ మనము పొందుటయే మనం తీసుకునే మొదటి అడుగు.నీవు వే ఆ మొదటి అడుగువల్లనే శత్రువు బలముసగము తగ్గుతుంది.
2.Stand spotless before the enemy.

శత్రువు యెదుట నిర్దోషముగా నిలువగల్గాలి.అంటే మనము శత్రువు యెదుట నిలవబడినపుడు,మనలోనిలోపాలన్నీ,మన తప్పిదాలన్నీ,మన అపరాధములన్ని ఆ శత్రువు ఎత్తి చూపకూడదు.అలా అయితే మనము ఆ శత్రువును నేలకొరిగించలేము,ఎదురించి గెలువలేము.మనలో భయము,బలహీనత,సందేహము...ఉన్నాయా?ఇక శత్రువువే మన మీద పైచేయిచూపుతాడు.మన పాపము,మన వ్యసనము బలాలేవో, బలహీనతలేవో కన్నుక్కునే మన మీదకు వస్తాడు కదా!
✓మనము శత్రువు యెదుట నిలువబడాలంటే మోదట దేవుని యెదుట నిందారహితముగా,నిర్దోషముగా నిలువగలగాలి.
✓దావీదు నిత్యము దేవుని వాక్యపు మార్గంలో నడుస్తు,దేవుని చేత బోధింపబడేవాడు.
✓మిగిలిన ఇశ్రాయేలీయుల సైన్యములో యుద్ద నేర్పరులు గాని,సైన్యాధ్యక్షులు గానీ,చివరికి రాజు కూడా నిలువలేకపోయాడు.ఎందుకంటె వారికి తెలుసు వారికి దేవుని తోడుగాని,ఆయన సహాయం కాని,ఆయన వారిపక్షాన నిలువగల్గే పరిశుద్ధ హృదయము కాని వారికి లేవని అర్ధమైపోయింది.
✓యుద్ధభూమి లోనికి అడుగుపెట్టి,తనకు ఎదురుగా వస్తున్న దావీదును చూసిన గొల్యాతు తిరస్కరించాడు,కారణం?దేవుడు దావీదుకు తోడైయున్నట్లు గోల్యాతుకు అర్దమైందా?
తాను తమ దేవుడైన జీవముగల యెహోవాను దూషించుచున్నట్లు ఇశ్రాయేలీయులకు అర్ధము కాలేదు.అర్ధం కానంతవరకు ఏమి లేదు,కానీ దావీదు యుద్ధభూమిలోకి రాగనే,వచ్చినతోడనే...తన దేవునికి విరోధముగా మాట్లాడుతున్న దూషణలు పసిగట్టినాడు.అందుకే ఎవ్వరికి రానంత రోషమొచ్చింది దావీదుకు.
నీ యెదుట నున్న శత్రువుకు యెదురుగా నిలవబడే శక్తి నీకు ప్రభువే దయచేస్తారు. అయితే అందుకు ముందు దేవుని సన్నిధిలో ఆయన ముఖకాంతిలో నిందారహితముగా నిర్దోషముగా నిలువగల్గుటకు అలవర్చుకోవాలి,నేర్చుకోవాలి,ప్రయాసపడాలి.అప్పుడు 1 రాజులు 17:1లో ప్రవక్తయైన ఏలియా "ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో..."అని చెప్పగలము.అప్పుడు ప్రభువే మనకు సహాయ పడతారు. .ఆమెన్🙏
~StephyBlesseena,
BERACHAH HOLY FELLOWSHIP.

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA