నా హేబేలు అర్పణ-MyAbel Offering
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.
ఆదిలోనే దేవుని చేత వెళ్ళగొట్టబడిన కుటుంబము.
ఆదాము,హవ్వల రెండవ కుమారుడు.కయీనుకు చిన్న తమ్ముడు.తమ తండ్రి ఏదేనులోనుండి వెళ్లగొట్టబడిన తరువాత కలిగిన సంతానము.కయీను భూమిని సేద్యపరస్తు...తన పంటలోనుండి కొంత,హేబేలు గొర్రెలను మేపుకుంటూ తన మందలో తొలిచూలిన పుటినవాటిలో క్రోవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చారు.కాని దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించారు.కారణం?
కయీను తెచ్చిన పంటలోని అర్పణ ఆయనకి నచ్చలేదా?మరి దేవుడు అన్నదమ్ముల మధ్య భేదము చూపారా?ఎందుకు హేబేలు అర్పణ దేవుడు లక్ష్యపెట్టి అంగీకరించాడు?
And Abel brought of the firstborn of his flock and of the fat portions. And the Lord had respect and regard for Abel and for his offering, [Heb. 11:4.]
Genesis 4:4 AMPC
దేవుడు హేబేలును లక్ష్యపెట్టుటకు ముందు హేబెలును గౌరవించాడా?అయినా ఒక శపించబడ్డ వాణి కుమారుడిని ఎలా లక్ష్యపెట్టగలడు దేవుడు?ఎలా గౌరవించగలడు దేవుడు?
*కయీను తెచ్చిన అర్పణ...ఏదో ఒక కృతజ్ఞతార్పణగా కనపడుతుంది
✓కానీ హేబేలు తెచ్చిన అర్పణ దహనబలిగా,పాప పరిహారార్ధ బలిగా కనపడుతుంది.
*కయీను దేవుడు తనను చూడాలి,తనయందు లక్ష్యముంచాలి, అనే ఆలోచన లేనివానిగా వచ్చాడు.ఒకవేళ ఆ ఆలోచన ఉంటె..తన హృదయము ఎప్పుడో సిద్దపడును కదా! తనను దేవుడు అంగీకరిస్తారా లేదా అని?
✓కానీ హేబేలు తన అర్పణతో దేవుని యెదుట ఎంత తగ్గించుకున్నాడో?దహనబలి అంటే తాను దేవునిచేత అంగీకరింపబడుట.
✓హేబేలు ప్రయాసేమో ,పాపమువలన వెళ్ళగోట్టబడ్డ తన తండ్రి వలె తాను వెళ్ళగొట్టబడకూడదు.అందుకే తను డైరెక్ట్గా దేవుని యెదుటికి వెళ్ళే ముందు తన పక్షముగా పరిహారార్ధముగా ఒక బలిపశువును
ఉంచాడు.ప్రభువా,దేవా నన్ను నా దోషమును చూచే ముందు నాకు బదులుగా నా పక్షముగా స్థానములో నిలువబడిన ఈ గొర్రె పొట్టేలును లక్ష్యపెట్టండి.పాత నిబంధనలో బలులు అర్పించునప్పుడు ఇలాగే చేసేది వారు.తమ దోషములన్నీ ,తప్పిదములన్ని ,అపరాధములన్నియు తమకు బదులు దేవుని యెదుట నిలువబడే ఆ బలిపశువు మీద చేతులుంచి ఒప్పుకునేవారు.ఇక ఆ బలిపశువు వారి దోషమునకు రావాల్సిన శిక్ష మరణాన్ని తానూ భరించి...వారికి తన రక్తాన్ని ఇస్తుంది.ఆ రక్తమునుచూచినపుడు అదోక ధైర్యము...నేను భరించాల్సిన దోషశిక్ష భరించినవారు ఎవరో ఒకరు ఉన్నారు.
✓అలాగే హేబేలు కూడా ...ఎలాగు తన తండ్రి వెళ్ళగొట్టబడ్డాడు,తన తండ్రినే అంగీకరించని దేవుడు తనను అంగీకరిస్తారా?ఒకవేళ అంగీకరిస్తారనే guarantee ఏంటీ?
✓అలాంటి barrier
✍️మొదటిగా మనము దేవుని యెదుట నిలువబడునప్పుడు..మనకు బదులు మన స్థానములో మన దోష శిక్ష బరించగల్గిన ఒక బలిపశువును నిలబెట్టాలి.లేదంటే కాల్చబడతామేమో!
📖కీర్తనలు 24: 3
యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
✍️దేవుని సన్నిధిలో కనపడాలి,నిలువబడాలి అనుకోనే వ్యక్తి ముందుగా చేయవలసింది తనకు బదులుగా ఒక బలిపశువు ఉండాలి.ఆ బలిపశువు యేసుప్రభువారే!నీకోసం నాకోసం మనందరి పాపశిక్షణను భరించి వహించి సిలువవేయబడి మరణించిన ఆ పస్కా బలిని,మనముందుంచాలి.
✍️మనము తండ్రి యెదుట,ఆయన ముఖకాంతిలో,ఆ సన్నిధిలో ధైర్యముగా నిలువగల్గుటకు అభయం,ధైర్యము మనము దేవుని యెదుట నీతిగా నుండాలని తన్నుతాను బలిగా అర్పించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తువారే!ఆయన నీ ముందు నిలబడకుండా...నీవు తండ్రి యెదుట నిలబడలేవు.
✍️అయితే యేసుప్రభువువారు నీకు బదులు నీ స్థానములో నీ దోషశిక్షను భరించి మరణించారు అనే సంపూర్ణ గ్రహింపు వాస్తవముగా నీకేంతో అవసరం.దాని గురించిన జ్ఞానము,స్పృహా మరింత అవసరం.
అలా ప్రభువు నీకు ముందు ఒక దహన బలిగా నిలువబడితేనే నీవు అంగీకరింపబడగలవు.హేబేలు మనకు నేర్పే పాటము ఇదే.దేవుడు మిమ్మును దీవించును గాక.ఆమెన్.
~StephyBlesseena
Praise the Lord
ReplyDelete