TheBible
బైబిలు చదువు, ఒక దినపత్రికలాగా కాదు, మన ఇంటికి వచ్చిన ఉత్తరం లాగా చదువు. పక్వానికి వచ్చిన పరలోక ఫలాలు వ్రేలాడుతూ మనకు అందేంత సమీపంలోనే అవి ఉన్నాయి, వాటిని ప్రోగుచేసుకో. ఆ పేజీలో వాగ్దానం దొరికిందా నీకు ఇష్టమైనంత సొమ్ము నీవే వ్రాసుకుని బ్యాంకు నుండి సొమ్ము తెచ్చుకునేందుకు నీ చేతిలో ఉన్న ఖాళీ చెక్కు అది, సొమ్ము చేసుకో. ప్రార్థన అక్కడ కనిపించిందా, దానిని పొదివి పుచ్చుకో. అది నీ అంబుల పొదిలో మరో బాణం నీ ఆశను నెరవేర్చేది. పరిశుద్ధతకు ఒక ఉదాహరణ నీముందు కనిపించిందా? దేవుడ్ని అడుగు నీకు ఆయన ఎంత చేయగలడో అంతా చేయమని. ఒకవేళ మహిమాయుతంగా సత్యం బయలు పర్చబడితే నక్షత్రంలాగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశిం పనివ్వు. నీలోని పరిశుద్ధమైన కోరికలు లతల్లా లేఖనాలను పెనవేసుకోని.అప్పుడు నీవు కూడా కీర్తనాకారునిలా నీ శాసనాన్ని నేను ప్రేమిస్తున్నాను, దినమంతా దానిని ధ్యానిస్తాను” అని చెప్పగలవు. దానిని సాధన చేసేందుకు సిద్ధపడితే తప్ప, లేఖన జ్ఞానాన్ని తలకెక్కించుకుని దాని విషయమై కలలు కంటే ప్రయోజనం లేదు. మనముందుంచబడిన అభిప్రాయాన్ని బాధ్యతగా నిర్వహిస్తే తప్ప ప్రయోజనం లేదు. మన ఆహ్లాదం కోసం...