విశ్వాసయుక్తమైన మాట "ఎంత దీవెన" తెచ్చింది? ~Stephy Blesseena

యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకందరికి నా హృదయపూర్వకమైన వందనములు.మరియొక నూతన దినములో ఈ విధముగా దేవుని వావాక్యముచేత మరల ఉజ్జీవింపబడి,హెచ్చరింపబడుటకు ప్రభువిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను.ఈ దినము నయోమి జీవితమూ లోనుండి ఒక చిన్న విషయాన్నీ ధ్యానము చేసుకుందాము. రూతు-1:8 నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక; విశ్వాసయుక్తమైన మాట "ఎంత దీవెన" తెచ్చింది?ఇదే రూతు జీవితములో "నయోమి" ద్వారా,నయోమి కూడా ఊహించలేని విధముగా జరిగిన ఓ అద్భుతము.అవును,విశ్వాసమెప్పుడు కూడా మనము అడుగగలిగినదాని కంటే,మనము ఊహించగలిగిన దాని కంటే...అతిశ్రేష్ఠమైన కార్యాలుచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా...మన ప్రభువు మనమీద ఎంత గొప్ప భారము పెట్టారో తెలుసా...ఆదికాండము లో ఆదియందు దేవుడు సృజించిన భూమ్యాకాశములను, చిమ్మచీకటియైన అపవాది వలన నిరాకారముగా,శూన్యముగా....మ్రింగివేయబడి,పాడై చెడిపోయిన తన సృష్టి నిమిత్తము దేవుని ఆత్మ,ఆ జలములపైన అల్లాడుచుండగా....దేవుడు వెలుగు క...