విశ్వాసయుక్తమైన మాట "ఎంత దీవెన" తెచ్చింది? ~Stephy Blesseena
రూతు-1:8
నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;
విశ్వాసయుక్తమైన మాట "ఎంత దీవెన" తెచ్చింది?ఇదే రూతు జీవితములో "నయోమి" ద్వారా,నయోమి కూడా ఊహించలేని విధముగా జరిగిన ఓ అద్భుతము.అవును,విశ్వాసమెప్పుడు కూడా మనము అడుగగలిగినదాని కంటే,మనము ఊహించగలిగిన దాని కంటే...అతిశ్రేష్ఠమైన కార్యాలుచేస్తుంది.
ప్రియ దేవుని బిడ్డలారా...మన ప్రభువు మనమీద ఎంత గొప్ప భారము పెట్టారో తెలుసా...ఆదికాండము లో ఆదియందు దేవుడు సృజించిన భూమ్యాకాశములను, చిమ్మచీకటియైన అపవాది వలన నిరాకారముగా,శూన్యముగా....మ్రింగివేయబడి,పాడై చెడిపోయిన తన సృష్టి నిమిత్తము దేవుని ఆత్మ,ఆ జలములపైన అల్లాడుచుండగా....దేవుడు వెలుగు కమ్మని పలుకగా...వెలుగు కలిగినది కదా..నిజముగా ప్రభు కార్చిన రక్తమునందు విశ్వాసముంచు ప్రతి "విశ్వాసి" కూడా ఆలాగున దేవుని సృష్టిని,ఆశీర్వాదమును,దీవెనను పలుకగలిగే భారము నిచ్చాడు.అందుకే కదా..."మీరు భూమీద వేటిని బంధింతురో,అవి పరలోకమందు బంధింపబడును.మీరు భూమీద వేటిని విప్పుదురో,అవి పరలోకమందు విప్పబడును" అనే గొప్ప అధికారమును ప్రభువు మనకనుగ్రహించారు.అవును మనము విశ్వాసముతో గొప్ప కార్యాలను చూడటమే కాదు,అనుభవించుట మాత్రమే కాదు గాని,గొప్ప కార్యాలను మాట్లాడుతాము.అయితే....మనము...విశ్వాసముంచుట దగ్గరే తరచూ ఆగిపోతుంటాము.
నయోమి కూడా తన జీవితములో,మోయాబు నుండి,తిరిగి బేత్లెహేమునకు ,దేవుడు తన దర్శించుటను నమ్మి బయల్దేరునప్పుడు,తన ఇద్దరు కోడళ్ళు తనతో పాటు వస్తుంటే,ఆమె తన ఇద్దరు కోడళ్లను దీవిస్తుంది.దేవుని నామమున దీవింపబడుట అంటే ఇశ్రాయేలీయులకు చాల ఇష్టమైన కార్యము.అంతమాత్రమే గాక,తమ్మును ఎవరైనా దేవుని పేరట దీవించడము,తాము ఎవరినైనా దీవించడము ఇష్టపడేవారు.నయోమి ఎలాంటి ఉద్దేశ్యముతో దీవించిందో తెలీదు కానీ,ఆ చిన్న దీవెన రూతులో ఎంత నమ్మకాన్ని,విశ్వాసాన్ని నింపిందో.మనము గమనిస్తే నయోమి దీవించుటకు ముందు...ఓర్పా,రూతులిద్దరు తమ ఇండ్లకు వెళ్లిపోవలెనని సిద్ధపడ్డారు.కానీ ఎప్పుడైతే,నయోమి "యెహోవా మీ మీమీద దయచూపును గాక అని పలికినదో...రూతు మనస్సు మార్చుకునినది.
6. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;
17. నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.
ఒకవేళ నయోమి దీవించక పోయియుంటే...రూతులో అంతటి విశ్వాసము నింపబడేదా?దేవునికత్యంత ప్రియమైనవారలారా...మన పరిస్థితులెలాంటివైనా మన నోటా "దేవుని దీవనలే"రావాలి.నయోమి పరిస్థితి ఎలాంటిది?కానీ అలాంటప్పుడు కూడా...నయోమి నోటినుండా...దేవుని నామమున ఆశీర్వచనపు పలుకులు విని రూతు హృదయములో ఎంత ఆశ చిగురించినదో...
దేవుడు ఈ మాటలను మన కోరకు దీవించును గాక.ఆమెన్.ఆమేన్..ఆమెన్.
✍️ స్టెఫీ బ్లెస్సీనా
Comments
Post a Comment