RUTH: A CROWN FOR THE LORD'S PURPOSE ~ Stephy Blesseena
Greetings to you All in the most precious and mighty name of our LORD and SAVIOUR JESUS CHRIST "రూతు-దేవుని చిత్తానికి ,దేవుని ఆలోచనలకు కిరీటమును,మహిమయై యున్నది" రూతు-3:11 కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు. దేని విషయములో ఆమె యోగ్యురాలిగా ఎంచబడినది?ఎందుకు యోగ్యత?అసలు ఒక వ్యక్తికి యోగ్యత అవసరమా?అసలు మన వ్యక్తిగత జీవితాల్లో యోగ్యత ఎందుకు?ఎం చేస్తుంది?ఇక్కడ బోయజు రూతును గూర్చి ,ఆమె తనకు భార్యగా యోగ్యురాలు అంటున్నాడా?లేక మరింకేదైనా విషయములోనా? యోగ్యతగా అంటే ఏమిటి? బోయజు దృష్టిలో ఏది యోగ్యత? మీ దృష్టిలో యోగ్యత అని దేనిని అనుకుంటున్నారు? తగ్గించుకోవడం ....ఇమిడిపోవడం,ఒదిగిపోవడం ..కదా ! ఇలాంటి అర్ధాలు ఉన్నాయి యోగ్యతకు. మరి రూతు దేని విషయములో యోగ్యురాలిగా ఎంచబడినది? రూతు ఎటువంటి కుటుంబము లోనుండి వచ్చింది?ఆ కుటుంబ మర్యాదలు ఎలాంటివి?అని మనము ఆలోచిస్తే అసలు ఏ మాత్రమూ పొందిక కుదరదు! 👉🕮 ఆదికాండము 19: 37 " వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పే రు పెట్టెను. అతడు నేటివరకు మోయా...