Rahab-Faithfulness raahaabu విశ్వాసము
తన యెడల నమ్మకత్వం గలిగిన వారిని దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు. యెహోషువా - 6:22 - 25 రాహబు- ఒక వేశ్యయే కావచ్చు గానీ,దేవుని యెడల ఎంత నమ్మకత్వం కనుపరచింది!యెరికో గోడల - ప్రాకారముల మీద నివసించే ఆమే,ఇప్పుడైతే(6:25) - ఇశ్రాయేలీయులతో కలిసి నివసించుచున్నది. హీనమైన- అమర్యాద గల్గిన ఆమె జీవితం ఎంతలా మార్చబడింది! - *నిజంగా దేవుడు మనలను మార్చగలడు , మనలను మార్చలేనివాడు కాడు, మార్చగలడు కాబట్టి మనలను స్వీకరించాడు. *ఎంతటి వారినైనా, ఆయనకు సమానమైన రూపము- స్వభావంలోనికి మార్చగలడు . -అయన రక్తానికీ ఎంత శక్తి వుంటే...అంత సమాన రూపానికి మార్చగల్గుతుంది?. రాహాబు జీవితం ఎంత అద్భుతంగా మార్చబడిందో ! ఆమే దేవుని వంశంలో - చేర్చబడింది. * అది కూడా - దేవుని వంశంలో...యూదా గోత్రములో. దేవుడు ఆమెను,ఇశ్రాయేలు 11 గోత్రములలో చేర్చలేదు గాని యూదా గోత్రములో చెర్చారు దేవుని గోత్రమైన - యూదా గోత్రములోనే దేవుడు select చేసి చేర్చాడు. దేవుని నమ్మటం అంటే, చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఆమె నమ్మింది, చెడుతనం విడిచిపెట్టింది, భయపడింది. రక్షింపబడింది, తన ప్రవర్తన (వ్యభిచారం) మానుకునింది. ఆమె ధర్మశాస్త్రానికి లోబడింది. ఇశ...