Rahab-Faithfulness raahaabu విశ్వాసము
తన యెడల నమ్మకత్వం గలిగిన వారిని దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు.
యెహోషువా - 6:22 - 25
రాహబు- ఒక వేశ్యయే కావచ్చు గానీ,దేవుని యెడల ఎంత నమ్మకత్వం కనుపరచింది!యెరికో గోడల - ప్రాకారముల మీద నివసించే ఆమే,ఇప్పుడైతే(6:25) - ఇశ్రాయేలీయులతో కలిసి నివసించుచున్నది.
హీనమైన- అమర్యాద గల్గిన ఆమె జీవితం ఎంతలా మార్చబడింది!
- *నిజంగా దేవుడు మనలను మార్చగలడు , మనలను మార్చలేనివాడు కాడు, మార్చగలడు కాబట్టి మనలను స్వీకరించాడు.
*ఎంతటి వారినైనా, ఆయనకు సమానమైన
రూపము- స్వభావంలోనికి మార్చగలడు .
-అయన రక్తానికీ ఎంత శక్తి వుంటే...అంత సమాన రూపానికి మార్చగల్గుతుంది?.
రాహాబు జీవితం ఎంత అద్భుతంగా మార్చబడిందో !
ఆమే దేవుని వంశంలో - చేర్చబడింది.
* అది కూడా - దేవుని వంశంలో...యూదా గోత్రములో.
దేవుడు ఆమెను,ఇశ్రాయేలు 11 గోత్రములలో చేర్చలేదు గాని యూదా గోత్రములో చెర్చారు
దేవుని గోత్రమైన - యూదా గోత్రములోనే
దేవుడు select చేసి చేర్చాడు.
దేవుని నమ్మటం అంటే, చెడుతనాన్ని విడిచిపెట్టడం.
ఆమె నమ్మింది, చెడుతనం విడిచిపెట్టింది,
భయపడింది. రక్షింపబడింది, తన ప్రవర్తన (వ్యభిచారం)
మానుకునింది.
ఆమె ధర్మశాస్త్రానికి లోబడింది. ఇశ్రాయేలీయులలో
సహపౌరురాలి లాగా ఆమె చేర్చబడిందంటే, రక్షకుడు రావాల్సిన గాత్రంలో ఆమె చేరిందంటే,ఆమె ఎంత పరిశుద్ధపరచబడినది!
*ఆమె ధర్మ శాస్త్రాన్ని నెరవేర్చింది.
*దేవుని గోత్రమైన యూదా గోత్రములో ఉన్న 4గురు స్త్రీలు - అపవిత్రులే.
తామారు - రాహాబు - రూతు - బత్షెబా.వారు ఎంత పవిత్ర పరచబడితే వారిని ఆయన గోత్రము వంటి
పరిశుద్ధ గోత్రములో చేర్చబడ్డారు.
* దేవుని యొద్దకు రాకముందు - వారు కళంకులే
గానీ వచ్చిన తరువాత దేవుడు వారిని ఎంత ఉన్నతంగా హెచ్చించినాడు!
*మనం నిజంగా ఆయనను నమ్మితే - నమ్మగలిగితే
నమ్మకమైన వారిగా మనం జీవిస్తే దేవుడు మనలను కూడా అలాగే అంత ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు.
- ఆ గోత్రములోనికి రావాలని ఆమె ఏర్పరచుకొనలేదు
కానీ, దేవుడు ఆమెను చేర్చాడు.
*2 తిమోతి - 2:19
"ప్రభువు తనవారిని ఎరుగును"అంటే - దేవుడు ఎంత Confidentగా ఒక వ్యక్తిని నమ్ముతాడు!
*✓యోబు 2: 3.......నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడు.
✓యోబు 2: 10....ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.
అందుకనే సాతానుతో దేవుడు సవాలు-challenge చేస్తున్నాడు.
*దేవుడు యోబును ఎంత నమ్మినాడు!
-ఆపవాది వాదిoచడానికీ ప్రయత్నం చేసాడు,అతడు నీయందు ఊరికనే భయభక్తులు కల్గియున్నాడా!(యోబు-1:9,10),నీవు అతని చుట్టు వేసిన కంచెను తీసివేయు.కానీ యోబు నమ్మిక - ఆస్తులు, పిల్లల గురించి కాదు,అవి ఉన్నా - లేకపోయినా నమ్మికే.
దేవుని మీద యోబుకున్న నమ్మిక బాహ్య సంబంధమైన
వాటితో ముడిపడలేదు.తన స్వంత దేహం కుళ్ళిపోయి, పురుగుపట్టినా బూడిదలో కూర్చుని, చిల్ల పెంకులు గీచుకునే
పరిస్థితి ఏర్పడినా యోబు నమ్మిక ఏ మాత్రం సడలలేదు.
-ఇతడు నమ్మకస్థుడు, ఏ పరిస్థితులలోనైనా నన్ను విడువడు,నా మాటకు అవిధేయత చూపడు,నన్ను ప్రేమించి, ఘనపరుస్తాడు- దేవుడు అనుకోవాలి.
నయోమి-ఓర్పా, రూతులకు ఎన్ని ఆశలు చూపెట్టింది.
ఓర్పా ఆశలకు లొంగిపాయింది,కానీ రూతు తన మనస్సు కుదుర్చుంది.
దేవుడు నిన్ను నమ్మాలి కదా! ఏ ఆశలు - ఆంక్షలకు
లోబడకూడదు.దేవుడు నిన్ను నమ్మే భక్తి చేయాలి కదా!
*"నీళ్ళు ఉన్న చోట బురద కూడా వుంటుంది"అనేది లోక సామెత.
* మనల్ని దేవుడు నమ్మితేనే కదా పరలోకం ఇచ్చేది.దెయ్యాలు నమ్మినట్లు కాదు,మన నమ్మక - దయ్యాల నమ్మిక వేరుగా ఉండాలి కదా!
*మోషే రాజ- విశ్వాసముగలవాడై ఐగుప్తు విడిచిపెట్టినాడు.
ఎంత నమ్మకమైనవాడు!
ఐగుప్తు సంపద, ఆస్థి, బంగారం సింహసనన్ని ఎరగా చూపించినా,దేవుని గూర్చిన,దేవుని పక్షముగా శ్రమయే ఎంచుకున్నాడు.దేవుడు మోషేను ఎంత నమ్మినాడో!
*1తిమోతి-1:12,13 - లో పౌలు "నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు,నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను.దేవుడు పౌలు నమ్మాడు.
దేవుడు నమ్మేంత నిజమైన,యధార్దమైన నమ్మకత్వం మనలో కనబడుతుందా?
*నమ్మించడము వేరు-నమ్మకముగా ఉండటమువేరు.
*మోసం చేయడం అంటే
నమ్మేట్లు కనబడి.. మరల నమ్మకం పోగొట్టుకొనడము
దేవుడు మన జీవితాల్లో నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు.
మనం దేవున్ని నమ్మడం వేరు
దేవుడు మనల్ని నమ్మడం వేరు.
* అబ్రహమును నమ్మాడు దేవుడు.
✓ఎంత నమ్మితే -- భూలోకనివాసులందరికీ తండ్రిని చేస్తాడు?
- అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, (నెహెమ్యా-9:8)
- అలాంటి నమ్మకత్వం అనే ముద్ర మనం పొందగలమా?
మన భక్తి నాణ్యమైనదేనా, నమ్మకమైనదేనా?
దేవుడు మెచ్చి సంతోషించునదేనా?
అలాంటి నమ్మకత్వముంటే వుంటే అంచెలంచెలుగా
దేవుడు ఆశీర్వదిస్తాడు.
Praise the lord
ReplyDelete