BOOK OF NUMBERS -Pastor Stephen
🕮సంఖ్యాకాండము 13:17-21 మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో18. దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో19. వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,20. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము21. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
👉దేవుడు ఉద్దేశ్యించి,నిర్ణయించిన మార్గాన్ని నమ్మలేని,భక్తి జీవితo ఎన్నడూ దేవుని వాగ్దానాలను చూడలేదు.ఆ భక్తిహీనతే వారిని ముప్పైయెనిమిది సంవత్సరాలు తిరుగులాడునట్లు చేసింది.దేవుడు విచారించింది ,మరల మనము విచారించాలా?అంటే ఎవరిదీ జ్ఞానము?మనదా ?దేవునిదా?ఒకసారి దేవుడు నీవు నడవాల్సిన మార్గమును పరిశీలనగా విచారించగా...ఇంకా నువ్వు ఆలోచించేది ఏంటి?అసలు నిజముగా దేవుని తీర్పును నమ్మని నీవు,గౌరవించని నీవు ,ఆయనను ఏ మాత్రం మహిమపరచగలవు ?అది అసాధ్యము !ఎప్పుడైతే వారు దేవుని వాగ్దాన దేశాన్ని విచారించాలి,అనుకున్నారో అప్పుడే వారు ఆ కృపను కోల్పోయారు.నిజముగా అసలు ఆ దేశము ఉందా ?అక్కడ భూమి ఎలా ఉంది?సారమైనదేనా?అక్కడ నివాసములు ఉన్నాయా?దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో?వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,దానిలో చెట్లున్నవో లేవో?నిజముగా ఆలోచనలు విన్నప్పుడు దేవుని మనస్సు ఎంత బాదపడియుంటుందో!అందుకే....వారిని నలభై సంవత్సరాలు అక్కడక్కడే తిప్పి తిప్పి తిరుగులాడునట్లు చేసాడు .మన జీవితములో కూడా అంతే .మొదట మన జీవితాల్లో మనము దేవుని నిర్ణయాలను,ఉద్దేశ్యాలను ,ఆయన మార్గాలను గౌరవించడము నేర్చుకోవాలి....
ఆ తరువాత విశ్వాసము.నీ విశ్వాసము ....గౌరవములోనుండి రావాలి.ఆ గౌరవము లేకపోతె నీ నమ్మకము వృదాయే!చాలామంది నమ్మకముంచుతారు కానీ ఆ నమ్మకము లో కొంచెము కూడా గౌరవము ఉండదు.ఆ గౌరవము లేనందు వల్లనే వారిలోని నమ్మకము చాల సులువుగా కరిగి నీరైపోతుంది .ఇశ్రాయేలీయులు నమ్మకముంచారు కానీ,ఏమాత్రము గౌరవము లేదు.అందుకే ఆయనను సందేహించడానికి,ఆయన గురించి గొణగడానికి ఏ మాత్రమూ సంకోచించలేదు.ఈ ప్రశస్తమైన సమయములో ప్రియ దేవుని బిడ్డా...నిజముగా నీవు దేవుని ఎంత గౌరవిస్తున్నావు?ఒక్కసారి నిన్ను నీవు పరిశిలన చేసుకో !నీ నమ్మకము,విశ్వాసము దేవుని మీద గౌరవము తో నిండియున్నదా?ఆ గౌరవము లేకపోతె మనము కూడా ఇశ్రాయేలీయులు వలెనె ఆయన ను అగౌరవపరచి కృపలను పోగొట్టుకుంటాము.ప్రభు సహాయము వేడుకుందాము.దేవుడు ఈ మాటలన్నీ మనకొరకు దీవించును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్!
✍ పాస్టర్ స్టీఫెన్
Comments
Post a Comment