"స్థిర విశ్వాసము" - "విశ్వాస-యాగము" -"విశ్వాస పక్షముగా పోరాడుట" ~స్టెఫీ బ్లేస్సీనా



                                BERACHAH PRAYER HOLY FELLOWSHIP



యేసుప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనములు .ప్రియులారా మీరందరు ప్రభులో సంతోస్తున్నారని మేము దేవుని స్తుతిస్తున్నాము.ఈ ప్రశస్తమైన సమయములో దేవుని పరిశుద్ధ గ్రంధములోనుండి క్రొత్త నిభందనలోనుండి ఒక చిన్న మాట ను మనము ధ్యానము చేసికొందాము."స్థిర విశ్వాసము" ,మరియు "విశ్వాస-యాగము" ,"విశ్వాస పక్షముగా పోరాడుట"
మూల వాక్యములు": ఫిలిప్పీ-1:14,27,2:17


1.విశ్వాస-యాగము- మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును.
విశ్వాస విషయములో యాగము అంటే ఏమిటి?యాగము అంటే త్యాగము,విసర్జించుట ...వదులుకొనుట.అవును విశ్వాసము విషయములో మనము ఎన్నో యాగములు చేయాల్సియుంటుంది.మన ఆలోచనలు ,ఇష్టాలు,మనకి నచ్చినవి,ఇంకా మన జ్ఞానము,మన తలంపులు అలాంటివి మరెన్నో మనము వదులుకోవాల్సి యుంటుంది.వాటిని యాగములు అంటాము.ఇలాంటి యాగములు ఎన్నెన్నో చేయాల్సి ఉంటుంది.ఎన్నో యాగములలోనుండి జన్మిస్తుంది విశ్వాసము.మనము దేవుని కోసము విశ్వసించునపుడు ...విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి.లేకుంటే విశ్వాసము నిలబడదు.అనేకమైన యాగముల మధ్య విశ్వాసము జనిస్తుంది.విశ్వాస విషయములో యాగము అంటే ఏమిటి?యాగము అంటే త్యాగము,విసర్జించుట ...వదులుకొనుట.అవును విశ్వాసము విషయములో మనము ఎన్నో యాగములు చేయాల్సియుంటుంది.మన ఆలోచనలు ,ఇష్టాలు,మనకి నచ్చినవి,ఇంకా మన జ్ఞానము,మన తలంపులు అలాంటివి మరెన్నో మనము వదులుకోవాల్సి యుంటుంది.వాటిని యాగములు అంటాము.ఇలాంటి యాగములు ఎన్నెన్నో చేయాల్సి ఉంటుంది.ఎన్నో యాగములలోనుండి జన్మిస్తుంది విశ్వాసము.మనము దేవుని కోసము విశ్వసించునపుడు ...విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి.లేకుంటే విశ్వాసము నిలబడదు.అనేకమైన యాగముల మధ్య విశ్వాసము జనిస్తుంది.యాగము లేనిదే విశ్వాసము లేదు.విశ్వాసమే ఒక బలియాగము.

2.విశ్వాస పక్షముగా పోరాడటం-1:v27నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
అవును మనము కలిగియున్న విశ్వాసము  విషయములో మనమే పోరాడాలి.మన విశ్వాస విషయములో మనకు ఎదురయ్యే పోరాటం ,బయటి వ్యక్తుల ద్వారానో లేక పరిస్థితుల ద్వారానో అయినా....మనలో మన తలంపులలో,మన ఓపిక విషయములో మన ఆలోచన విషయము లో మన బుద్ధి,జ్ఞానము విషయములో  జరిగే పోరాటములో...మనము విశ్వాస పక్షమునే నిలబడాలి.అవును మన విశ్వాసము పక్షముగా పోరాడాలి,లేకుంటే ఆ విశ్వాసము జారిపోతుంది.సన్నగిల్లిపోయి బలహీనమవుతుంది.నీవు ..నీలో నున్న విశ్వాసము కొరకు ఎంత పోరాడుతున్నావు?ఎంత ప్రయాసపడుతున్నావు?నీలో కలిగే అవిశ్వాసము ,అపనమ్మిక ఎదుట,లోకాశలు,లోక ప్రేరేపణల ఎదుట ...విశ్వాస పక్షముగా పోరాడుతున్నావా...?అబ్రాహాము తనలో కలిగిన అవిశ్వాసము విషయములో తన శరీరము,శారా శరీరము మృతతుల్యమైనదని తలచాడు కానీ వెంటనే ...విశ్వాస పక్షమున పోరాడాలని నిశ్చయించుకుని వెంటనే...విశ్వాస పక్షముగా పోరాడాడు.విశ్వాసాన్ని ఘనపరిచాడు.నీవు కూడా విశ్వాసాన్ని ఘనపరుస్తున్నావా?మనము ....పరిస్థితులెలాంటివైనా మనము విశ్వాస పక్షమునే పోరాడాలి.కానీ చాలా మంది..పరిస్థితులకు లొంగిపోయి...విశ్వాసాన్ని ఒంటరిగా నిలబెట్టేస్తారు.విశ్వాస పక్షమున పోరాడరు.ఒకసారి విశ్వాసాన్ని ఒంటరిగా విడిచిపెడితే మరల నీలో ఆ విశ్వాసము ఎలా నింపబడుతుంది? ఒకసారి విశ్వాసాన్ని ఒంటరిగా విడిచిపెడితే మరల నీలో ఆ విశ్వాసము ఎలా నింపబడుతుంది?

 


మనకంటూ ఇష్టమైనవి ,మనకు సౌకర్యవంతమైన క్రియలు,పద్ధతులు...ఇలా చాలా వాటిని విడువాల్సి వస్తుంది.అబ్రాహామును 22లో దేవుడు పరీక్షించినపుడు అబ్రాహాముకు ఎంతో ఘనమైన విశ్వాసము, స్థిరమైన అవసరమైంది.చాల కంఫర్ట్ పోస్టిన్ Comfort Position లో ఉన్నాడు అబ్రాహాము.ఎన్నో యేండ్ల ఎదురుచూపు నెరవేరి..చాల బాగా స్థిరపడ్డాడు,అటు భౌతికంగా ,ఆత్మీయముగా చాల లోతుగా స్థిరపడ్డాడు.కానీ ఇపుడు దేవుడు పెట్టిన పరీక్షలో నిలబడాలంటే తనలో చెలరేగే ప్రతి వ్యతిరేక తలంపులు .....వాటన్నిటిని గెలవాలంటే....comfort zones ,తాను అంత వరకు పట్టుకునియున్న విశ్వాసము కోసము...తన స్థిరపడిన వాటన్నిటిని యాగము చేయాలి,అలా యాగము చేసిన విశ్వాసము  పక్షముగా పోరాడాలి.
3.స్థిర విశ్వాసము-1:14మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి.
అవును విశ్వాసములలో చాలా రకములు ,అప్పుడే మొలకెత్తిన విశ్వాసము ,చల్లారిపోయిన విశ్వాసము,బలహీనమైన విశ్వాసము,బలమైన విశ్వాసము .మనము స్థిరమైన విశ్వాసము పొందాలంటే,అనేకమైన యాగముల ద్వారా పొందిన విశ్వాస పక్షముగా పోరాడి నిలబెట్టుకొనాలి,ఆ నిలబెట్టుకున్న విశ్వాసాన్ని బలపరచుకొనాలి.స్థిరపరచుకొనాలి.కొంతమంది...ఆరభించునపుడు ఎన్నో వదులుకుని ,విడిచిపెట్టి విసర్జించి విశ్వసిస్తారు...కానీ అది మొలకెత్తే దశలోనే త్రుంచేస్తారు.దాని స్థిరమైనదిగా ఎదుగనీయరు.

నీ విశ్వాసము స్థిరమైనదిగా ఎదుగాలంటే నీవు విశ్వాసము కొరకు యాగము చేయాలి,విశ్వాస పక్షముగా పోరాడాలి.ప్రభు సహాయము కోరుకుందాము.దేవుడు ఈ మాటలన్నీ మన కొరకు దీవించును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్ .

                                                                                         ✍స్టెఫీ బ్లేస్సీనా 

Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena