TheBible


బైబిలు చదువు, ఒక దినపత్రికలాగా కాదు, మన ఇంటికి వచ్చిన ఉత్తరం లాగా చదువు. పక్వానికి వచ్చిన పరలోక ఫలాలు వ్రేలాడుతూ మనకు అందేంత సమీపంలోనే అవి ఉన్నాయి, వాటిని ప్రోగుచేసుకో. ఆ పేజీలో వాగ్దానం దొరికిందా నీకు ఇష్టమైనంత సొమ్ము నీవే వ్రాసుకుని బ్యాంకు
నుండి సొమ్ము తెచ్చుకునేందుకు నీ చేతిలో ఉన్న ఖాళీ చెక్కు అది, సొమ్ము చేసుకో. ప్రార్థన అక్కడ కనిపించిందా, దానిని పొదివి పుచ్చుకో. అది నీ అంబుల పొదిలో మరో బాణం నీ ఆశను నెరవేర్చేది. పరిశుద్ధతకు ఒక ఉదాహరణ నీముందు కనిపించిందా? దేవుడ్ని అడుగు నీకు ఆయన ఎంత
చేయగలడో అంతా చేయమని. ఒకవేళ మహిమాయుతంగా సత్యం బయలు పర్చబడితే నక్షత్రంలాగా నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశిం
పనివ్వు. నీలోని పరిశుద్ధమైన కోరికలు లతల్లా లేఖనాలను పెనవేసుకోని.అప్పుడు నీవు కూడా కీర్తనాకారునిలా నీ శాసనాన్ని నేను ప్రేమిస్తున్నాను,
దినమంతా దానిని ధ్యానిస్తాను” అని చెప్పగలవు.
దానిని సాధన చేసేందుకు సిద్ధపడితే తప్ప, లేఖన జ్ఞానాన్ని తలకెక్కించుకుని దాని విషయమై కలలు కంటే ప్రయోజనం లేదు. మనముందుంచబడిన అభిప్రాయాన్ని బాధ్యతగా నిర్వహిస్తే తప్ప ప్రయోజనం లేదు. మన
ఆహ్లాదం కోసం మనం బోధ చేయకూడదు, దానిని మనం ఆచరించాలి.అప్పుడు మనకు మరుగుచేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు మనకు సమస్తం తెలియజేస్తాడు; మన యెదుట లోతైన సంగతులను, మధురమైన భావాలను
ఆయన విప్పి తెరచి చూపిస్తాడు. కానీ అతి చిన్న ఆజ్ఞకు మనం విధేయత చూపేందుకు నిరాకరిస్తే, లేఖనాలపై మన కోసం ఉదయించే వెలుగు మసగబారుతుంది. మన హృదయాలలో అభిలాష త్వరలోనే మరణిస్తుంది.
మన జీవితం యొక్క ప్రణాళికనంతా ఒకే మారు చూపడు కానీ ఒకదాని తర్వాత ఇంకొకటి బయలుపరుస్తాడు. ప్రతిరోజు ఒక తెర తీసేందుకు అవకాశం
ఇస్తాడు. ఒక కొయ్యసీలను చెక్కేందుకు, లోహానికి మెరుగుపెట్టేందుకు ముగింపులో ఆ ముక్కలన్నింటిని ఒకచోట చేర్చి అకస్మాత్తుగా రూపం కల్పిస్తాడాయన
అవకాశం ఇస్తాడు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. జీవితం
. మనం అప్పటికి సమాధితోటను చూస్తాం. దైవికమైన తలంపు
యొక్క అందం కూడా చూస్తాం. అప్పుడు మనకు తృప్తి కలుగుతుంది.
. అప్పటి వరకూ దేవుని ప్రేమను నమ్మి, మన కోసం ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని
అతిశ్రేష్ఠమైన పనిని చేయనిద్దాం.
ఉదయాన్న ఆ దిన ప్రణాళిక ఏమో విప్పి చూపమని దేవుడ్ని అడుగు.
చేసేందుకు అవసరమైన కృపను లేదా ఆయన సిద్ధం చేసిన వాటిని భరించేం
దుకు శక్తిని ఆయనే ఇస్తారు. దినచర్య మధ్యలో తరచూ కన్నులు పైకెత్తి
"తండ్రీ, ఇదేనా నీ ప్రణాళిక?” అని అడుగు. రాత్రివేళ మౌనంగా ఆయన
సన్నిధిలో ఉండుడి, దేవుని ఆలోచనతో దినచర్యను సరిపోల్చుకో. పాపాలను
ఒప్పుకోవటం, తొందరపాట్ల విషయం పశ్చాత్తాపపడటం, మరింత ఖచ్చి
తంగా పరలోకమందు ఎలాగో భూమ్మీద అలాగే నెరవేర్చేట్లు సాయపడమని
అడుగు.
బలహీనమైన మనస్సాక్షిని గాయపరిచే పనిని చేస్తానేమోనని జాగ్రత్త
కలిగి ఉండు. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైన ఆలోచన. అన్నిం
టిలోను స్వాతంత్ర్యము కలదు గానీ అన్నీ చేయదగినవి కావు. అవెందుకు
చేయదగినవి కావు? అవి బహుశా హానికరములు కాకపోయినా అలా
చేయటం చూచినవారి బలహీన మనస్సాక్షిని దెబ్బతీస్తుంది. దీనిని మాదిరిగా
తీసుకుని వాళ్లు తప్పు చేసే ప్రమాదం లేకపోలేదు. అందుచేత క్రైస్తవ
జీవితంలో నమ్మదగిన మాదిరిగా ఉండు. ప్రతిచర్యను చక్కగా అంచనా
వెయ్యి. అది అనేకులను ప్రభావితం చేస్తుంది.
సమాజం విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. నీ సాక్ష్యంపైన కుంచం
బోర్లించే పని అది చేస్తుంది. ఈ లోకంలో నువ్వు వెలుగుగా ప్రకాశించాలి.
లైట్ హౌస్ యొక్క ముఖ్యమైన పని వెలగటం. ఒక్కమారు వెలిగి, మరోమారు
దాగి ఉండటం, చీకటిపైన అకస్మాత్తుగా ప్రకాశించటం, మళ్లీ కనిపించకుండా..
పోవటం వలన అలలపై అల్లాడేవారికి నువ్వు కొండపై ఉండి ఏం ప్రయోజనం! ఉపయోగపడకుండా ఉండటం కంటే అధ్వాన్నస్థితి మరొకటేముంది.
ఈ లోకంలో మన నిజమైన ఉపయోగం అది. ఋతువైనా, ఋతువు కాకపోయినా క్రీస్తు సాక్ష్యాన్ని మనలో నిలుపుకోవటం, లోకానికి చూపటం,
తుఫానులోనైనా, సూర్యుడున్న సమయమే అయినా ఆయన సాక్ష్యం మనలో చూపించటం. నువ్వు ఎక్కడికి వెళ్లినా నీతో ఆయనను రమ్మని అడగటం,వెళ్లేటప్పుడు ఆశీర్వదించమని ప్రార్థించటం, సమస్తం ఆయన మహిమ
కొరకు చేయటం. ఆయన అంతరంగానికి ప్రియమైన దానిని చెయ్యటం,నిషేధ ప్రదేశంలో నువ్వు అడుగుపెట్టకుండా ఉండటం చెయ్యాలి.

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA