క్రీస్తులో-క్రీస్తువలె || In Christ-Christ Like

యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.

క్రీస్తు యేసులో యిప్పుడ ఏదైతే దేవుడు యిచ్చాడో దానికన్న ఎక్కువగా దేవుడు యివ్వడు! 
నీవు ఎంతగా దీవించబడ్డావంటే, పరలోకం ఏదైయితే
యివ్వగలిగిందో అదంతా యివ్వబడింది! నీవు నీతిమంతుడవుగా, పూర్తిగా
క్షమింపబడినవాడుగా, దేవుని కుమారునిగా మార్చబడినావు, ఆయన నిన్ను యిష్ట
పడుచున్నాడు. ఆయన నీ స్వరము వినాలనీ, అది మధురమైంది అని చెప్పాలనీ
కోరుతున్నాడు. ( పరమ గీతాలు 2:14).
నీవు తండ్రియొద్దకు వచ్చినప్పుడు క్రీస్తువలే
కనబడుతావు!
తన కుమారుడైన యేసును తండ్రీ ఏవిధంగా స్వీకరిస్తాడో, అలాగే
నీవు కూడ క్రీస్తులో, క్రీస్తువలే స్వీకరించబడుతావు! (ఎఫెసీ 1:6).
క్రైస్తవునిగా నీకున్న వారసత్వం, నీవు క్రీస్తువలే మారుట! తండ్రీ కుమారుని
ఎంతగా ప్రేమిస్తున్నడంటే. తన కుమారినిలాగ వున్న వారందరి చేత పరలోకంలో
నిలుపుటకు ఆశ కల్గివున్నాడు.
తన కుమారిని వలే నిన్ను మార్చుటకు దేవుడు
ప్రతినిత్యం నీ పైన పని చేస్తున్నాడు. పరమందు నీవు చేరి క్రీస్తుతో నీవు
పరిపాలించుటకు శక్తి గల్గివుండుటకు నిన్ను దేవుడు తర్బీతు చేస్తున్నాడు. నీవు
“అధికారము ఎలా చేయాలో నెర్చించే స్కూల్లోన్నావు, “పరిపాలించుటకు
తర్భీతులో ఉన్నావు.
నీ వ్యక్తిగత గమ్యం ఎప్పుడో నిర్ణయించబడింది!
తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో
వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా
నిర్ణయించెను”. (రోమా 8:29)
ఆలోచించండి! అనేకమంది “సహోదరులు” వారు సింహాసనము పై
కూర్చుండి క్రీస్తు ప్రభువుతో పరిపాలన సాగిస్తారు.
దేవుడు మిమ్మును దీవించును గాక.ఆమెన్🙏
~సేకరించబడినది.

Comments

Popular posts from this blog

నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.

BOOK OF NUMBERS -Pastor Stephen

Neglected Responsibility of Aaron-Berachah Prayer Holy Fellowship