వాగ్దాన-నెరవేర్పు-పరిపక్వత



మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.

ఈ రోజు మనందరి జీవితములో కనపడే ఓ చిన్న విషయము ధ్యానం చేసుకుందాము.ఎందుకంటే అది చాలా స్వల్పమైనది,సాధారణముగ మనము గ్రహించలేనంత సూక్ష్మమైనది.దానిని మన జీవితములో సరి చేసుకొని,చక్కపరచుకుంటే మన మార్గాలు సరళమైనట్లే.మనలో ప్రతి వ్యక్తి,దేవుని పరిశుద్ధ వాక్యమును చదివే ప్రతి వ్యక్తి,చదువబడిన ఆ వాక్యపు నేరవేర్పుకోరకు ఆశపడతాము,చాలా ఎదురుచూస్తాం.కానీ చివరికి ఆ నేరవేర్పు మన కన్నుల ఎదుటే ప్రత్యక్షపరచబడితే దానిని పొల్చుకోలేక,తట్టుకోలేక,నమ్మలేక,మనలను ఆ నేరవేర్పులో చూచుకోనలేక....ఎన్ని నేరవేర్పులను మన జీవితంలో కోల్పోయి యుంటామో!Ii ఈ విషయములో ఎంత మంది నాతో అంగీకరించగలరు?
Comment about yourself.
✓📖సంఖ్యాకాండము 13: 27
వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి.
✓📖సంఖ్యాకాండము 13: 31
​అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
✓📖సంఖ్యాకాండము 13: 32
​​మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.

Christian, we can’t let this be our life story – don’t let fear keep us from the blessings that God has promised.
In Numbers 13th Chapter, the people of Israel were paralyzed because of their own thoughts.
ఇస్రాయెలీయులు మోషేను ఒప్పించి(ద్వితి-1:22,23),వారిలో గోత్రమొక్కటింటికి ఒక మనిషిని చొప్పున 12 మందిని,ఆ వాగ్దాన దేశానికి పంపించారు.
📖సంఖ్యాకాండము 13: 18,19,20
​దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో,
వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,
దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము.Look at the words underlined.What does that mean?
Here comes their over estimation.
ఉన్నావో లేవో,మంచివో చెడ్డవో,సారమైనదో నిస్సారమైనదో....అంటే దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమని...ముందునుoడే పితరులతో వాగ్దానము చేసినది నిజమా కాదా అనే సందేహమా?మొత్తము మీద దేవుని సామర్ధ్యము మీద అనుమానము.దేవుని మీద అనుమానంతో, అవిశ్వాసము తో జీవితములో   ఏమి సాధించేది లేదు.విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై యుండుట ఆసాధ్యము మరియు నాకు వేరుగా ఉండిమీరేమియు చేయలెరు.
*4 వందల సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న వాగ్దానాన్ని కన్నులారా చూశారు,కాని దానితో వారూ పొల్చుకోలేకపోయారు.
*నిర్గమకాండము 2: 24
కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
*నిర్గమకాండము 2: 25
దేవుడు ఇశ్రాయేలీ యులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.
✓వారి మూలుగులు,వారి వెట్టిచాకిరి,వారి మనోవేదనలు విని-చూచి-వారియందు  లక్ష్యముంచి వారి యొద్దకు దిగివచ్చి.....వారికి ముందు వారిలో ఒకని తనకొరకు ఏర్పరచుకొని  ఆ ఇనుపకోలిమిలోనుండి వారిని బయటకు తీసుకురావాలని ఆ దేశ ఫరోతో సయితము సవాలు చేసి..వారిని గొప్ప బాహువుతో బయటకి రప్పిం చిత్తే....వారు ఆ నేరవేర్పు నమ్మలేకపోయారు.ఆ వాగ్దాన దేశాన్ని వేగుచూచిన వారి విశ్వాసము బలపడిందా?...లేదు మరింత బలహీనమై...తమను తామూ పొల్చుకోనుట మొదలు పెట్టారు.
👉కొన్ని సార్లు ,దేవుడు చూపెంత వరకు ఆ వాగ్దానాన్ని మనము వేగుచూడకూడదు.వేగుచూడడం అంటే..రహస్యముగా తొంగి చూడటమే కదా!ఎందుకంటె...ఆ వాగ్దానము మనము పొందుటకు తగిన పరిపక్వత మనలో చూస్తే ప్రభువే స్వతంత్రింపచేస్తారు.
👉1పేతురు 5: 6
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
తగిన సమయము -అదే ఆయనకు ఇష్టమైన యోగ్యమైన సమయము+మన పరిపక్వత.
*ఆ నేరవేర్పు వచ్చినతరువాత...అయ్యో ప్రభువా !నేను యోగ్యుడను/యోగ్యురాలను కాదేమి అనేది తగ్గింపు అనుకుంటాము ,కానీ అది తగ్గింపు కాదు.దేవుని విషయములో పరిపక్వత నొందిన మనస్సు,ధైర్యముగా వాగ్దానాలను స్వాతంత్రించుకుంటుంది.
👉పరిపక్వత నొందకమునుపే.....ఆ వాగ్దానాన్ని వేగు చూచామా!దానితో సమముగా మనల్ని పొల్చుకుని అవిశ్వాసముతో ప్రేరేపించబడే ప్రమాదముంది.ఏమో!ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆ వాగ్దానభూమిని వేగుచూడకపోతే స్వతంత్రించుకునేవారేమో!
*ఈశ్రాయేలీయులు చూడాల్సింది అంత వరకు దేశములోని శత్రువుని కాదు,ఆ దేశము ఇస్తానని వాగ్దానము చేసిన దేవుణ్ణి.ఆ శత్రువు ఎవరైతే, ఎలాంటివారైతే వీరికెందుకు?కొన్ని సార్లు దేవుని కార్యానికి,మన స్వంత స్వీయ బుద్ది-జ్ఞానాలే అడ్డుపడతాయి.ఈ ప్రశాంతమైన సమయంలో మనము దానిని గ్రహించాలి.తలమీద నుంచబడ్డ ఆశీర్వాదాన్ని,మేలును,దైవకార్యం అది ఏదైన మన బుద్దిహీనతతో పోగొట్టుకోనకుడదు,తిరిగి మరల సంపాదించుటకు,సంపాదించలేము.
పరిశుధాత్మ దేవుడు మనకు సహాయ పడతారు.ఆమెన్
~StephyBlesseena
@berachahipuru.

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA