సెలోపేహాదు కుమార్తేలు-#PastorStephen

యేసుప్రభువువారి పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు  హృదయపూర్వకమైన వందనాలు.
సెలోపేహాదు కుమార్తేలు.
Unsung heroes-
Daring Daughters
 -Law.makers
-Women.Empowerment
-Faithful Daughters.  ఇంకా వీరికి చాలా పేర్లు ఉన్నాయి 
📖సంఖ్యాకాండము 27: 1
అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థు లలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.

*Daughters of Zelopehad - 5
Mahla, Noah, Hogla, Milcah, Tirza.
మనష్షే గోత్రములో యోసేపు కుమారుడైన
 సంఖ్యాకాండము -26:29-33
సెలోపేహాదు కుమార్తేలు పరిశుద్ధగ్రంధములో చాల ప్రత్యేకతను సంపాదించుకున్నారు.సెలోపేహాదు కు కుమారులు లేరు, అయిదుగురు కుమార్తేలే.అయితే ఆ సెలోపేహాదు చనిపోయిన తరువాత వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలీయులు సేనలుగా బయల్దేరునట్లు,20 సంవత్సరములు పై ప్రాయముగలవారిని లెక్కించవలెనని మోషే దేవుని వలన ఆజ్ఞ పొందాడు.ఆలాగు లెక్కించునప్పుడు గోత్రములచొప్పున,తండ్రి పేరుచొప్పున లెక్కించి,వారికి చీట్లు తీసి వాగ్దాన భూభాగాన్ని యెహోషువ పంచవలసియున్నది.అంత వరకు పురుషుల పెరునుబట్టియే స్వాస్థ్యము పంచబడును కాని స్త్రీలకుు భాగము లేదు,ఐతే సెలోపేహాదు కుమార్తేలు మోషే యెదుటను,యాజకుడైన యేలియజరు యెదుటను,ప్రధానుల యెదుటను,సర్వ సమాజముయెదుటను నిలువబడి ఒక ఆశ్చర్యకరమైన విన్నపము చేసారు,అది ఒక విశ్వాసపూరితమైన,సాహసపూరితమైన ప్రార్థనగా కనపడుతుంది.ఈ ప్రార్థనలో మాదిరిని మనము నేర్చుకుంటే మనము కూడా సెలోపేహాదు కుమార్తేలవలెనే నూతన కార్యాలను చూడగలము,సాధించగలము.
1.పాపపు ఒప్పుకోలు
✓వారి తండ్రి దోషమును ఎంత యధార్ధముగా ఒప్పుకున్నారు!మా తండ్రి కోరహు తిరుగుబాటులో ఏకీభవించలేదు.నిజముగా ఒక తప్పుదమును అంగీకరించి ఒప్పుకొనుట చాల ఘనమైనకార్యము.అంతటి జనసమూహములో సర్వ సమాజములో తమ తండ్రి దోషమును ఆడపిల్లలుగా తండ్రికి కుమార్తెలుగా  తమది కాని దోషము-పాపమును ఒప్పుకొనుట ఎంతటి ధైర్యము!అవును పాపమును ఒప్పుకొనుటకు అంతరంగిక ధైర్యము అవసరమే!
✓అంతటి సర్వసమాజములో కూడా,మా తండ్రి, కోరహు తిరుగుబాటులో ఏకీభవించలేదు అని చెప్పగలిగారు అంటే ఎంత యధార్ధమైన ఒప్పుకోలు! వారు అలా చెప్పినప్పుడు సమాజములో ఎవ్వరూ కూడా సెలోపేహాదు మీద నేరస్థాపన చేయలేదు,చేయడానికి ముందుకు రాలేదు!సెలోపేహాదుకు ఎంత గొప్ప సాక్ష్యం!అంటే కోరహు తిరుగుబాటు విషయములో తమ తండ్రి నిర్దోషి అని ఆ అయిదుగురు కుమార్తేలు సర్వసమాజములో తమ తండ్రి నిర్దోషత్వాన్ని నిరూపించారు.తన సొంత వ్యక్తి గాథ పాపమును బట్టి చనిపోయాడు.ఒక బాధని,కీడుని,నష్టాన్ని మంచిమనస్సుతో దేవునియొద్దనుండి అంగీకరించడము ఓ అరుదైన అనుభవము!
2.మేము వాగ్దాన దేశములో స్వాస్థ్యము పొందాలి అనే విశ్వాసము! విశ్వాసం,వాగ్దాన దేశములో ప్రవేశించాలని.
ఇంకా వాగ్దాన దేశానికి వేలుపాలె ఉన్నారు,లోపలికి పోలేదు,అయినకాని ఎంత నిశ్చయత!వాగ్దాన దేశములో తమకూ ఒక భాగం స్వాస్థ్యము కావాలి,పొందుకోవాలనీ.
వారి చుట్టునున్న ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ వాగ్దాన దేశములో మనకంటె బలవంతులు,ఆజానుబాహులున్నారు,వారి దృష్టికి మనము మిడతలవలె ఉన్నాము,కాబట్టి మనము ఆ దేశమును స్వాతంత్రించు కొనలేము అనే పాట పాడుతున్నారు.వారిలో ఏ ఒక్కరికి నమ్మకము,విశ్వాసము లేదు.అంతా సణిగే గుంపే,గొణిగే గుంపే.అలాంటి వారితో నివాసిస్తు కూడా..ఇంకా అరణ్యములో ఉండగానే ఆ వాగ్దాన దేశములో వారి వంతు బాగానే సంపాదించుకున్నారు.ఈ అరణ్యములోనే మమ్మును చంపాలని ఈ మోషే తీసుకువచ్చాడు,మేము ఈ అరణ్యములోనే రాలిపోతాము,మాకు ఆ దేశము వద్దు అని ఇశ్రాయేలీయుల సర్వ సమాజము భయందోళనలతో విశ్వాసముతో మాట్లాడుతుంటే,ఈ సెలోపేహాదు కుమార్తేలు మాత్రమే,మాకు ఆ దేశములో స్వాస్థ్యము కావాలి.మా తండ్రి లేదని మాకు వంతు ఇవ్వరేమో,మా తండ్రి లేనింతమాత్రము చేతా మేమెందుకు స్వాస్థ్యము పొందకూడదు?మేము ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వాతంత్రించుకుంటాము,మా తండ్రికి కుమారులు లేనందున మా స్వాస్థ్యము,మా తండ్రి స్వాస్థ్యము మాకుకాకుండా పోకూడదు.

📖సంఖ్యాకాండము 14: 31
అయితేవారు కొల్లపోవుదు రని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతం త్రించుకొనెదరు.
 ✓దేవుని మాటంటే ఎంత పట్టుదల! విశ్వాసము!
మరి మనము దేవుని మాటంటే -నిశ్చయత,పట్టుదల నీ బలమును ఎంత వరకు కాపాడుకొనగలము!కాపాడుకోనగల్గుతున్నాము?తమ తండ్రి చనిపోయాడు,అయిన కానీ వారి పట్టుదల తగ్గలేదు.కుమారులకే గానీ ,కుమార్తెలకు అంత స్వాస్థ్యము పొందే హక్కు లేదు,కానీ ఈ అయిదుగురు కుమార్తేలు తమ పట్టుదల, విశ్వాసముతో ఆ హక్కును సంపాదించారు.

✓చూచి నమ్మినవారికంటె,చూడకనమ్మినవారు ధన్యులు కదా.
📖యోహాను 20: 29
యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
✓Looking at the situations,seeing upon the situations,we are being held by the weaknesses,unbelief,we are struggling to find the trust and Confidence.But the Daughters of Zelopehad were so trying in believing the invisible Promised Land and also which unreachable with the naked physical eyes.
✓మనమేమో పరిస్థితులను చూసి అవిశ్వాసముతో బంధింపబడి,బలహీనతతో బంధింపబడి,తలమీద పడుతూ, విశ్వసించటానికి కష్టపడుతున్నాం కానీ సెలోపేహాదు కుమార్తేలు బాహ్య నేత్రాలకు అందని,ఆ దృశ్య భూభాగాన్ని,ఇంకా తమ కళ్ళతో చూడని ఆ దేశాన్ని ఎంత బలముగా నమ్ముతున్నారు!
✓అబ్రహాముకు పాదము పాదము పట్టునంత భూమి నియ్యకుండ నీ సంతానానికి ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్తే ఆ మాట నమ్మాడు, అదే నీతిగా ఎంచబడింది.(అపో.కార్యములు-7:5)
* ఎక్కడికి వెళ్ళవలెను ఎరుగకయే బయలువెళ్ళేను.
📖హెబ్రీయులకు 11: 8
అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.
✓హెబ్రీయులకు 10: 34
ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.
✍️పరలోకము వేల్తాము,వెల్తాము అని చెప్పుకుంటాము.ok కానీ ఆ పరలోకాన్ని ఈ భూమ్మీదే సంపాదించాలి కదా!ఆ నిశ్చయత కావాలి కదా ముందుగానే రిజర్వ్ చేసుకున్నట్లు,ఆ సెలోపేహాదు కుమార్తెలవలే.
📖హెబ్రీయులకు 11: 13
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
✍️మన జీవితాలను, విశ్వాసమును, భక్తిని పరిశీలన చేసుకొనుము, ఆ కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయపడతారు.దేవుడు ఈ మాటలు మన గ్రహింపచేసి,మిమ్మును దీవించుగాక ఆమెన్.🙏
~PastorStephen.

Comments

Post a Comment

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA