దేవుని పక్షము vs అపవాది పక్షము
1 సమూయేలు - 18:17
"నీవు నా పట్ల యుద్ధ శాలివైయుండి
యెహోవా యుద్ధములను జరిగించుము."
ఈ భాగము దావీదుజీవితంలో ఎదురైన ఓ గొప్పసవాలు.
ఇశ్రాయేలియుల చరిత్రను ముగ్గురు వ్యక్తులు శాసించారు.
1. అబ్రహము - ఒకసంతానం వంశాన్ని స్థాపించినాడు,
2. మోషే- అబ్రహము పొందిన ఆ వాగ్దానాలు నెరవేర్చుటకు
ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి,దేవునికి - ఇశ్రాయేలీయులకు మధ్య ఒక మధ్యవర్తిలా- ధరశాస్త్రాన్ని
వారికందించి - వారినే - దేవునికి స్వాస్థం చేశాడు.
3 . దావీదు - దేవునికి ఒక సింహాసనాన్ని సిద్దపరచి,స్థిరపరిచాడు.
ఆ వాగ్ధాన దేశాన్ని రాజ్యపరంగా, భూజనులనులందరిలో
ఇశ్రాయేలు ఘనత నొందునట్లు, ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు.
అయితే తాను బాల్య కాలములో, ఇంచుమించు 15-17 సంవత్సరాల వయస్సులో అభిషేకం పొందిన తరువాత, ఒక పెద్ద యుద్ధం ఎదురైంది,
*గొల్యాతు అనే శూరుడు ఎదురవగా- ఆ యుద్ధంలో
ఇది యెహోవా యుద్ధము అని అయిదు చిన్న రాళ్లతో
ఆ బలాడ్యుడైన యుద్ధనేర్పరిని నేలను కూల్చగలిగినాడు.
17 వ అధ్యాయములో కనబడుతున్న యుద్ధం బాహ్యముగా కనిపించుచున్నగాని దావీదుకు మాత్రము అంతరంగిక యుద్ధం.
అది బయటికి-బాహ్యంగా గొల్యాతు అంత శూరముగా కనబడలేదుగానీ... తన అభిషేకాన్ని,తనతో దేవుని తోడును ప్రశ్నించి,కదిలించి పరీక్షించిన- యుద్ధం.తాను దేవుని పక్షముగా నిలువబడుతాడా లేదా అని తన అంతరంగాన్ని పరీక్షించిన యుద్ధము.
అప్పటికే, గొల్యాతుతో చేసిన యుద్ధంలో సౌలు వేలకొలది,
రావీదుకు పదివేల కొలది అని స్త్రీలు గానముచేయగా, దేవుడే జయమిచ్చినాడు, దేవుడే జయమొందినాడు
ఇది దేవుని యుద్ధం- యెహవా యుద్ధం కదా ! అని ఆలోచించే సామర్థ్యం లేక, ఆ జయాన్ని, గొల్యాతు
సంబంధికులైన ఫిలిష్తీయులు ఎంత బాధపడ్డారో
అంతలా బాధపడడం - అదే కోపం
పగ, ఈర్ష్య, అసూయ అన్నీ మొదలైనాయి సౌలులో.
సౌలు అనుకున్నాడు నా చెయ్యి direct గా వాని మీద పడుకుండదు,కానీ ఫిలిష్తియుల చెయ్యి పడొచ్చు,పడాలి.
అని ఎంతొ కుయుక్తిగా, కుట్ర పన్ని 18వ అధ్యాయము 17 వ వచనము లో దావీదు ను తనకొరకు తన పట్ల యుద్ధశాలిగా ఉండమని కోరుతున్నాడు,అంటే పరోక్షంగా నువ్వు దేవుని పక్షముగా ఉన్నావు అలా కాదు నా పక్షముగా వచ్చి నిలువబడు అని.
> అందుకే అప్పటికే పగతో రగిలిపోతున్న ఫిలిష్తీయులను
సౌలు తన పక్షంగా భావించుకొని,వారిమీదికి cunning తో మోసంతో - దావీదును యుద్ధానికి పంపించదలిచాడు.
1) ఆ యుద్ధానికి ఒక ఎరను ఏర్పరచినాడు,
అదే - తన పెద్దకుమార్తె మేంబును విచ్చి
1 సమూయేలు- 18:21 - ఆమె అతనికి ఉరిగా నుండునట్లు
పెండ్లి చేస్తానని.. ఒక అబద్ధపు ప్రమాణం చేశాడు.
2)18:22 - రహస్యముగా తన సేవకులను పిలిపించి
3)18:25 - ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న
తాత్పర్యము గలవాడై
ఇది దావీదుకు - మంచి యవ్వన వయస్సులు ఓ పెద్ద ఉరి,పరీక్ష బయటకు కనబడిని యుద్ధం.అవును మరి దావీదు ఈ యుద్దములో గెలిచాడా? అంటే గెలిచాడు.ఒక రాజు చేతిక్రింద ఉండటము మేలుకరమా?దీవెన కరమా?లేక దేవుని చేతిక్రింద ఉండటము దీవెన కరమా?అప్పటికే దావీదు మంచి యవ్వన ప్రాయములో ఉన్నాడు,యవ్వన ప్రాయములో ఉందే ఒకే ఒక గురి జీవితములో ఉన్నాట స్థాయిలో నిలవబడుట,రెండు వివాహము.అయితే దావీదు అప్పటికే దేవుని అభిషేకమునొందినా, రాజైన సౌలు వ్యతిరేకిగా నిలవబడలేదు కానీ, సౌలు తానను పంపిన చోటలకెళ్లను పోయి సుబుద్ది కలిగి పని చేసుకుంటూ వచ్చేవాడు.అలాగు దావీదు సౌలు పక్షముగా కాక దేవుని పక్షముగా నిలువబడు యుద్దాలు చేస్తువచ్చినాడు.*1సమూయేలు 25: 28 అబీగయీలు-"......నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక..."
ఒకవేల దావీదు సౌలు అనుకున్నట్లుగా సౌలు కోరకే పని చేస్తే సౌలు ఎలా దేవునికి వ్యతిరేకి అయ్యాడో దావీదు కూడా దేవుని వ్యతిరేకి అయ్యియుండేవాడు.ప్రతీ వ్యక్తి జీవితములో దేవుని పక్షముగా నిలువబడాల్సిన పరిస్థితులు అనేకములుగానే వస్తాయి.అయితే మనము ఎవరి పక్షముగా నిలువబడుతున్నాము?జయమా అపజయమా కాదు,ఎవరికి జయము ఎవరికీ అపజయమో ముఖ్యము.ఆపవాది మన యెదుట ఎన్నో రకాలైన యెరలను ఉంచుతాడు,అయితే వాటిని గ్రహించుట దేవుని ఆత్మ చేత ఆయన వాక్య పరిశోధన చేసే ఆంతర్య జ్ఞానమునకు మాత్రమే సాధ్యము.ఎన్నో సమయాల్లో ఎన్నో పరిస్థితులలో మనము నిలువబడితే దేవుని పక్షము లేదా దేవుని వ్యతిరేక పక్షము అని ఎంచుకోవల్సిన క్లిష్టమైన పరిస్తితిని దేవుడే మన ముందు తీసుకువస్తారు.మనము మాట్లాడే చిన్న మాటైనా,చిన్న క్రియయైన,చిన్న ఆలోచనయైన,తలంపైనా అది దేవుని పక్షమేనా?లేదంటే అది ఆపవాది పక్షమౌతుంది.కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనము ఆపవాది పక్షముగా నిలువబడి,దేవుని పక్షాన ఉన్నాట్లు సంభరపడిపోతుంటాము.దేవుని పక్షముగా నిలువబడుట అనేది చాలా సూక్ష్మమైన -సున్నితమైన ఆంతరంగిక ప్రతిష్ట.దావీదును గూర్చి దేవుడు సాక్ష్యామిచ్చినట్లు అపో.కార్యములు 13:22,దావీదు దేవుని మనసునే గెలిపించాడు.ఒక చిన్న కార్యం విషయమైనా, ఒక పెద్ద పనైనా,ఒక చిన్న ఆలోచనయైన, దేవుని సత్యం కొరకు - ఆయన పరిశుద్ధత కొరకు ఆయన పక్షముగా నీవు నిలువబడితే అదే నీవు దేవుని పక్షంగా చేసే యుద్ధం.
*ఫిలిప్పి - 1 : 30 క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే
గాక, ఆయన వక్షమున శ్రమపడుటయు
ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడియున్నది.
*వారానికి రెండు సార్లు ఉపవాసము,పుదిన,జీలకర్ర పదియవవంతుచెల్లిస్తు(మత్తయి-23:23,లుకా-18:12),ఎంతో నిష్టను పాటిస్తున్న పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువన్నారు,యోహాను 8:44మీరు మీ తండ్రియగు ఆపవాది సంబాధులు,మీరు మీ తండ్రి దురాశలే నేరవేర్చగోరుతున్నారు,వారిని గూర్చే బాప్తీసమిచ్చే యోహాను అన్నాడు,"సర్ప సంతానమా!".మన జీవితాన్ని పరీక్షించుకుంటే మనము ఎలా నడుచుకుంటున్నాము?దేవుని పక్షముగా లేక దేవునికి వ్యతిరేక పక్షముగానా?మనము దేవుని పట్ల యుద్ధశాలురమై ఆపవాది సామ్రాజ్యాలు,వాణి కుట్రలు కుయుక్తులు తెగనరికి వాణికి అపజయం ఎదురుపడేలా చేయాలి.కాని సౌలు లాగ కుయుక్తిని దేవుని యెదుట ప్రదర్శించకూడదు.ఆశేమో సౌలు ది( దావీదు చావడము),పేరేమో(దేవునియుద్దాలు) దేవునిది,ఎంత మోసం!ఈ రోజుల్లో మన భక్తిలో ఇదే జరుగుతుంది.ఆశమో మనది,పేరేమి దేవునిది.దేవుని పక్షముగా నిజముగా నిలువబడే వ్యక్తి మోదట దేవుని మనస్సు గ్రహిస్తాడు.కాని మనము మోదట దేవుని మనస్సు గ్రహించకుండానే ఎదో ఒక ఆశ,తలంపు,మాటను దేవుని పక్షమందున్నట్లుగా బ్రమతో దేవుని పేరు రుద్దుతాము.దేవునికి నష్టము లేదు కానీ ,మనము యే ఆలోచనతో దేవుని పేరు వాడుకున్నామో ఆ ఆలోచనే మనకు ఊరిగా మారి నాశనమౌతాము.జీవముగల దేవుడు బహు భయంకరుడు.ఆయన చెలగాటము చేయకూడదు.
దావీదు వాలె దేవుని పక్షము వహించి దేవుని యుద్దాలు చేయుదాము.అలాంటే గ్రహింపు,జ్ఞానము పరిశుద్ధాత్ముడు మనకు దయచేస్తారు.ఆమెన్.
~Stephy Blesseena
Praise the lord
ReplyDeletePraise the lord
ReplyDelete